IPL 2025: హార్దిక్ పాండ్యాపై నిషేధం.. మరి ఇప్పుడు ముంబై కెప్టెన్ ఎవరంటే ?
IPL 2025: ఐపీఎల్ 2025 ప్రారంభం కానుంది. మార్చి 22 నుండి ప్రారంభమయ్యే ఈ టోర్నమెంట్‌లో ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడనుంది.
IPL 2025: హార్దిక్ పాండ్యాపై నిషేధం.. మరి ఇప్పుడు ముంబై కెప్టెన్ ఎవరంటే ?
IPL 2025: Hardik Pandya Suspended - Who Will Captain Mumbai Now?
IPL 2025: ఐపీఎల్ 2025 ప్రారంభం కానుంది. మార్చి 22 నుండి ప్రారంభమయ్యే ఈ టోర్నమెంట్‌లో ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడనుంది. రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్ మార్చి 23న జరుగుతుంది. కానీ ఈ సమయంలో స్టార్ ఆల్ రౌండర్, ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆడడం కనిపించదు. తనపై ఒక మ్యాచ్ నిషేధం విధించారు. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో తను బెంచ్ మీద కూర్చుంటారు. టోర్నమెంట్ ప్రారంభానికి ముందే తనపై ఎందుకు నిషేధం విధించారో తెలుసుకుందాం.
హార్దిక్ పై ఎందుకు నిషేధం విధించారు?
ముంబై కెప్టెన్ గురించి తెలుసుకునే ముందు, హార్దిక్ పాండ్యాకు ఇచ్చిన శిక్ష గురించి తెలుసుకోవాలి. గత సీజన్‌లో హార్దిక్ ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా తిరిగి వచ్చాడు. దీని కారణంగా చాలా వివాదం చెలరేగింది. ఫలితంగా ముంబై జట్టు ప్రదర్శన క్షీణించింది. పాండ్యా కెప్టెన్సీలో ఆ జట్టు చివరి స్థానంలో నిలిచింది. దీని కారణంగా ఆయనపై చాలా విమర్శలు వచ్చాయి. ఇది మాత్రమే కాదు కెప్టెన్‌గా ఉన్నప్పుడు తను మూడుసార్లు స్లో ఓవర్ రేట్‌కు దోషిగా నిలబడాల్సి వచ్చింది.
నిబంధనల ప్రకారం ఇలా మూడుసార్లు జరిగితే జట్టు కెప్టెన్‌పై రూ.30 లక్షల జరిమానా విధిస్తారు. అలాగే, ఆ ఆటగాడిపై ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారు. గ్రూప్ దశలోని చివరి మ్యాచ్‌లో అతను స్లో ఓవర్ రేట్ అనే మూడో తప్పు చేశాడు. అయితే, అతని జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది. అందుకే అప్పుడు ఈ శిక్షను విధించలేకపోయారు.
ముంబై కెప్టెన్ ఎవరు?
జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ తొలి అర్ధభాగానికి దూరంగా ఉన్నాడు. అంటే అతను ముంబై కెప్టెన్సీ రేసులో ఉండడు. ఇప్పుడు హార్దిక్ లేకపోవడంతో సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ కెప్టెన్సీకి ఇద్దరు పెద్ద పోటీదారులుగా ఉన్నారు. ఛాంపియన్ ట్రోఫీయే అతని అద్భుతమైన కెప్టెన్సీకి నిదర్శనం.
ఇటీవలే టీమిండియా టీ20 జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన సూర్యకుమార్ యాదవ్ కూడా అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు. అతను అంతర్జాతీయ స్థాయిలో 23 T20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అందులో ఇండియా 18 గెలిచి 4 ఓడిపోయింది. అందుకే రోహిత్ మళ్ళీ కెప్టెన్సీని అంగీకరించడం కష్టమే అనిపిస్తుంది. అందువల్ల, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ముంబైకి కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది.