IPL 2025 Final: కొన్ని గంటలే మిగిలింది..ఐపీఎల్ ఫైనల్ ఆడే తుది జట్ల ఫ్లేయింగ్ ఎలెవన్ ఇదే

IPL 2025 Final: ఐపీఎల్ 2025 (IPL 2025) ఫైనల్‌కు ఇంకొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) తలపడనున్నాయి.

Update: 2025-06-03 03:21 GMT

IPL 2025 Final: కొన్ని గంటలే మిగిలింది..ఐపీఎల్ ఫైనల్ ఆడే తుది జట్ల ఫ్లేయింగ్ ఎలెవన్ ఇదే

IPL 2025 Final: ఐపీఎల్ 2025 (IPL 2025) ఫైనల్‌కు ఇంకొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) తలపడనున్నాయి. జూన్ 3న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ టైటిల్ పోరు జరగనుంది. ఆర్‌సిబి టీమ్ మొదట్నుంచీ మంచి ఫామ్‌లో ఉంది, 19 పాయింట్లతో పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండూ చాలా బలంగా కనిపిస్తున్నాయి. అయితే, ఫైనల్ మ్యాచ్‌కు గేమ్ ఫినిషర్ టిమ్ డేవిడ్ (Tim David) అందుబాటులో ఉంటాడా లేదా అనేది అభిమానుల ఆందోళనను పెంచుతోంది.

టిమ్ డేవిడ్‌పైనే అందరి కన్ను

టీమ్ విధ్వంసకర ఆల్‌రౌండర్ టిమ్ డేవిడ్ గాయం ఆర్‌సిబికి ఆందోళన కలిగించే విషయం. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో గాయపడిన డేవిడ్, అప్పటి నుంచి ప్లేయింగ్ XIలో కనిపించలేదు. అయినప్పటికీ, ఫైనల్ మ్యాచ్‌కు అతను అందుబాటులోకి వస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. డేవిడ్ లభ్యత గురించి కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ.. "డేవిడ్ వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉన్నాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు అధికారులు డేవిడ్ ఉంటాడా లేదా అన్నది మాకు సమాచారం ఇస్తారు. అప్పటివరకు ఏమీ చెప్పలేము" అని అన్నారు. ఒకవేళ టిమ్ డేవిడ్ ఫిట్‌గా లేకపోతే, లియామ్ లివింగ్‌స్టోన్ తుది జట్టులో కొనసాగుతాడు. మిగిలిన జట్టులో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు.

ఈ ఆటగాళ్లపై భారీ అంచనాలు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ విరాట్ కోహ్లీ, జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, మరికొందరు ఆటగాళ్లపై చాలా అంచనాలను కలిగి ఉంది. విరాట్ ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కాగా, జోష్ హేజిల్‌వుడ్ ఇప్పటివరకు 21 వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ తన ఐపీఎల్ కెరీర్‌లో పంజాబ్ కింగ్స్‌పై అత్యధిక వికెట్లు తీశాడు. అతను పంజాబ్‌పై ఇప్పటివరకు 32 వికెట్లు తీశాడు. కాబట్టి, ఈ ముగ్గురి ప్రదర్శన టీమ్‌కు చాలా కీలకం కానుంది.

రెండు జట్ల అంచనా ప్లేయింగ్ XI

RCB ప్రాబబుల్ ప్లేయింగ్ XI: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ, లియామ్ లివింగ్‌స్టోన్/ టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ.

ఇంపాక్ట్ ప్లేయర్; మయాంక్ అగర్వాల్

పంజాబ్ కింగ్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్: ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జోయ్, కైల్ జేమీసన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.

ఇంపాక్ట్ ప్లేయర్; ప్రభసిమ్రాన్ సింగ్

Tags:    

Similar News