IPL 2023 Playoffs: ఆ రెండు జట్లకు సెకండ్ ఛాన్స్
IPL 2023 Playoffs: ఐపీఎల్ 2023 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. లీగ్ పోరు పూర్తయింది.
IPL 2023 Playoffs: ఆ రెండు జట్లకు సెకండ్ ఛాన్స్
IPL 2023 Playoffs: ఐపీఎల్ 2023 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. లీగ్ పోరు పూర్తయింది. ఆఫ్స్ కు తెరలేవనుంది. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లఖ్ నవూ సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు ప్లే ఆఫ్స్ కి చేరుకున్నాయి. తొలి క్వాలిఫయర్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మంగళవారం జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్ కు అర్హత సాధిస్తుంది.
ఇక మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన లఖ్ నవూ సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య బుధవారం ఎలిమినేషన్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో ఆడుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు క్వాలిఫయర్ 1 విజేతతో ఫైనల్స్ అడుతుంది.
పాయింట్ల పట్టికలో టాప్ 2లో ఉన్న గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే క్వాలిఫయర్ మ్యాచ్ లో ఓడిన జట్టుకు సెకండ్ ఛాన్స్ ఉంటుంది. అంటే గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఈ రెండు జట్లలో ఏ ఒకటి ఓటమి పాలైనా..ఫైనల్ పోరుకు మాత్రం ఛాన్స్ ఉంటుంది.
ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్స్ షెడ్యూల్:
మే 23న తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ఉంటుంది. చెన్నై చెపాక్ మైదానంలో 23 రాత్రి 7.30 గంటలకు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడతాయి. ఇక మే 24న లఖ్ నవూ సూపర్ జెయింట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ ఉంటుంది. ఇది కూడా చెన్నైలోని చెపాక్ స్టేడియంలోనే ఉంటుంది. రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది. మే 26న క్వాలిఫయర్ 2 మ్యాచ్ ఉంటుంది. ఎలిమినేటర్ విజేతతో క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టు తలపడుతుంది. ఈ పోరు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిలవనుంది. ఈ మ్యాచ్ సైతం రాత్రి 7.30 గంటలకే ఉంటుంది. ఇక ఫైనల్ మ్యాచ్ వచ్చే సరికి 28న ఉంటుంది. క్వాలిఫయర్1 విజేతతో క్వాలిఫయర్ 2 విజేత తలపడుతుంది. ఈ ఫైనల్ పోరుకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. మ్యాచ్ 28 రాత్రి 07:30 గంటలకు ఉంటుంది.