IPL 2022: లక్నో జట్టులోకి కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్..!?

Update: 2021-12-04 07:44 GMT

IPL 2022: లక్నో జట్టులోకి కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్..!!

IPL 2022: ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందే ఇటీవలే రిటైన్ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. తాజాగా పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ తో పాటు సన్ రైజర్స్ జట్టు ఆటగాడు రషీద్ ఖాన్ మెగా వేలానికి రావడంపై ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లక్నో జట్టు యాజమాన్యం రిటైన్ ప్రక్రియ ముగియకముందే తమ ఆటగాళ్ళను ప్రలోభాలకు గురి చేసి వేలంలోకి వెళ్ళేలా చేశాయని పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ జట్లు లక్నో జట్టు యాజమాన్యంపై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది.

కేఎల్ రాహుల్ కి 20 కోట్లు, రషీద్ ఖాన్ కి 13 కోట్ల రూపాయలు ఇవ్వడానికి లక్నో ముందే ఒప్పందం కుదుర్చున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందువల్లే రాహుల్, రషీద్ ఖాన్ లు రిటైన్ ని వద్దనుకొని వేలంలో పాల్గొనబోతున్నారని సమాచారం. ఐపీఎల్ 2021 సీజన్ లో పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ కు 9 కోట్ల రూపాయలను చెల్లించగా తాజాగా లక్నో జట్టు యాజమాన్యం రెట్టింపు ఆఫర్ ఇవ్వడంతో పాటు జట్టు కెప్టెన్ గా నియమించడానికి ఓకే చెప్పడంతోనే రాహుల్ పంజాబ్ ని కాదని మెగా వేలానికి వెళ్ళాడని తెలుస్తుంది.

అయితే ఇలా తమ ఆటగాళ్ళను ప్రలోభాలకు గురి చేశారని లక్నో జట్టుపై వచ్చిన ఫిర్యాదుపైనే కాకుండా పలు కీలక అంశాలపై నేడు(శనివారం) బిసిసిఐ సమావేశం కానుంది. మరి నేడు జరిగే సమావేశంలో లక్నో జట్టుపైనే కాకుండా ఆ జట్టు యాజమాన్యంతో ఇలా రహస్య ఒప్పందం చేసుకున్న కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి..!!

Tags:    

Similar News