IPL 2021 Punjab vs Hyderabad: ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్ల దెబ్బకు 120 కే ఆలౌటైన కేకేఆర్

IPL 2021 Punjab vs Hyderabad: టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమైంది.

Update: 2021-04-21 11:57 GMT

వికెట్లు తీసిన ఆనందంలో హైదరాబాద్ బౌలర్లు (ఫొటో ట్విట్టర్)

IPL 2021 Punjab vs Hyderabad: టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమైంది. హైదరాబాద్ బౌలర్ల దెబ్బకు 20 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో సన్‌రైజర్స్ టీం ముందు 121 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

పరుగులు రాబట్టేందుకు పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్స్ చాలా కష్టడ్డారు. 4 ఓవర్లలో కేవలం 19 పరుగులే చేయగలిగారంటే అర్థం చేసుకోవచ్చు. ఇక తొలి వికెట్ గా రాహుల్ (4) పెవిలియన్ చేరాడు. భువనేశ్వర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌ మొదటి బంతిని షాట్‌ ఆడే ప్రయత్నంలో కేదార్‌ జాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక ఆ తరువాత వరుసగా వికెట్లు కోల్పోతూ పీకల్లోతూ కష్టాల్లో పడింది. ఖలీల్‌ అహ్మద్‌ వేసిన ఇన్నింగ్స్‌ 7 ఓవర్ చివరి బంతిని షాట్ ఆడే ప్రయత్నంలో మయాంక్‌ అగర్వాల్‌(22) రషీద్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తరువాత విజయ్‌ శంకర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ తొలి బంతిని గేల్‌ ఫ్లిక్‌ చేశాడు. అనవసరపు పరుగుకోసం ప్రయత్నం చేయడంతో.. కవర్స్‌లో ఉన్న వార్నర్‌ బంతిని మెరుపు వేగంతో త్రో విసిరగా అది నేరుగా వికెట్లను తాకింది. దీంతో పూరన్‌ గోల్డెన్‌డక్‌గా వెనుదిరిగాడు.

ఇక 9వ ఓవర్లో రషీద్‌ ఖాన్‌ వేసిన బంతిని ఆడడంలో విఫలమైన గేల్‌(15) ఎల్బీగా వెనుదిరిగాడు. ఇలా వరుస ఓవర్లతో మూడు వికెట్లు కోల్పోయి, కష్టాలు కోరి తెచ్చుకుంది పంజాబ్. టీం స్కోర్ 63 పరుగుల వద్ద దీపక్‌ హుడా(13) అభిషేక్‌ శర్మ బౌలింగ్‌లో ఐదో వికెట్ గా వెనుదిరిగాడు. ఆ తరువాత టీం ను షారుఖ్ ఖాన్(22 పరుగులు, 17 బంతులు, 2 సిక్సులు) తన భుజాలపై వేసుకుని పంజాబ్ గౌరవప్రదమైన స్కోర్ చేసేందుకు సహాయపడ్డాడు. ఆ తరువాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది.

ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు, అభిషేక్ శర్మ2 వికెట్లు, భువనేశ్వర్, రషీధ్ ఖాన్, సిదర్ధ్ కౌల్ తలో వికెట్ తీశారు.

Tags:    

Similar News