IPL 2021: హోరాహోరి పోరుకు సిద్దమైన ముంబై ఇండియన్స్ - చెన్నై సూపర్ కింగ్స్

* ఐపీఎల్ 2021 ఆదివారం ముంబై ఇండియన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ తో యూఏఈలో పునఃప్రారంభం కాబోతుంది.

Update: 2021-09-19 08:45 GMT

ధోని - రోహిత్ శర్మ (ఫైల్ ఫోటో)

IPL 2021: కరోన మహామ్మరితో అర్ధాంతరంగా ముగిసిన ఐపీఎల్ 2021 ఆదివారం ముంబై ఇండియన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ తో యూఏఈలో పునఃప్రారంభం కాబోతుంది. ఈ సీజన్ లో జరిగిన ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలైన ధోని సేన ఆదివారం జరగబోయే మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. కాని ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో దక్షిణాఫ్రికా ఆటగాడు డుప్లెసిస్ గాయం కారణంగా ఆదివారం జరగబోయే మ్యాచ్ కి దూరంగా ఉండనున్నాడని అతని స్థానంలో రాబిన్ ఉతప్ప ఆడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక సామ్ కర్రన్ క్వారంటైన్ పూర్తి కాకపోవడంతో సామ్ కూడా ఈ మ్యాచ్ కి దూరంగా ఉండనున్నాడు. చెన్నై జట్టులో కీలకంగా ధోని, సురేష్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజాలు రాణిస్తే ముంబై జట్టుపై విజయం సాధించడం అంత కష్టమేమి కాదని చెప్పొచ్చు. ఇక ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, పోలార్డ్, హార్దిక్ పాండ్యతో బ్యాటింగ్ లో పటిష్టంగా ఉండటంతో పాటు బుమ్రా, బోల్ట్ తో బౌలింగ్ లోను చెన్నై జట్టుకి గట్టిపోటీ ఇవ్వనుంది.

ఇప్పటివరకు జరిగిన చెన్నై- ముంబై మధ్య 32 మ్యాచ్ లు జరగగా అందులో 19 మ్యాచ్ లలో ముంబై జట్టు, 13 మ్యాచ్ లలో చెన్నై జట్టు విజయాన్ని సాధించింది. మరోపక్క దుబాయ్ లో 93 మ్యాచ్ లలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 38 విజయాలను, రెండవసారి బ్యాటింగ్ దిగిన జట్టు 54 సార్లు గెలుపొందాయి. ఆదివారం జరగబోయే మ్యాచ్ కి వర్షంతో ఎలాంటి అడ్డంకి లేదు. దుబాయ్ పిచ్ స్పిన్నర్స్ కి అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు సాయంత్రం 7:30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.

Tags:    

Similar News