IPL 2021 RR vs DC: రాజస్థాన్ లక్ష్యం 148; పంత్ హాఫ్ సెంచరీ

IPL 2021 RR vs DC: టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ టీం 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది.

Update: 2021-04-15 15:47 GMT

ఢిల్లీ క్యాపిటల్స్ వైస్ రాజస్థాన్ రాయల్స్ (ఫొటో ట్విట్టర్)

IPL 2021 RR vs DC: టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ టీం 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 147 పరగులు చేసింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ లక్ష్యం 148 పరుగులుగా నిర్ధేశించింది.

ఓపెనర్లుగా బరిలోకి దిగిన పృథ్వీ షా, శిఖర్ ధావన్ ఈ మ్యాచ్ లో రాణించలేకపోయారు. బ్యాటింగ్ చేసేందుకు చాలా కష్టపడ్డారు. ఉనద్కత్‌ తన అద్భుతమైన బౌలింగ్ తో ఢిల్లీ బ్యాట్స్‌మెన్స్‌ని భయపెట్టాడు. తొలి మ్యాచ్‌లో మెరుపు అర్ధశతకం సాధించిన పృథ్వీషా(2)1.6 ఓవర్లో ఉనద్కత్‌ బౌలింగ్‌లో లీడింగ్‌ ఎడ్జ్‌ తీసుకోవడంతో మిల్లర్‌కు సింపుల్‌ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం 4.1 ఓవర్లో ఉనద్కత్ మరోసారి ఢిల్లీని చావు దెబ్బ కొట్టాడు. ధావన్‌(9 పరుగులు, 11 బంతులు, 1ఫోర్) రివర్స్‌ స్కూప్‌ షాట్‌ ఆడే క్రమంలో వికెట్‌ కీపర్‌ శాంసన్ అద్భుతమైన క్యాచ్‌ అందుకోవడంతో ఔటయ్యాడు.

ఓపెనర్లిద్దరి వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఢిల్లీని ఉనద్కత్‌ మూడో వికెట్ తీసి పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు. నిలకడగా ఆడతాడనుకున్న రహానేని(8 బంతుల్లో 8; ఫోర్‌) పెవిలియన్‌కు పంపాడు. వరుసగా వికెట్లు పడుతున్నాయి. పంత్ తో కలిసి ఆదుకుంటాడనుకున్న ఆల్‌రౌండర్‌ స్టొయినిస్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. ముస్తాఫిజుర్‌ బౌలింగ్‌లో బట్లర్‌ అద్భుతమైన రన్నింగ్‌ క్యాచ్‌ అందుకోవడంతో స్టొయినిస్‌ పెవిలియన్‌ చేరాడు.

ఆదుకున్న పంత్..

వికెట్లు టపటప పడుతున్నాయి. అయినా తన దూకుడు తగ్గించలేదు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్. కష్టాల్లో ఉన్న ఢిల్లీని ఆ జట్టు కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌(30 బంతుల్లో 50; 9 ఫోర్లు) హాఫ్‌ సెంచరీతో ఆదుకున్నాడు. బాధ్యతాయుతంగా బ్యాటింగ్‌ చేస్తూ ఆ జట్టు గౌరవప్రదమైన స్కోర్‌ సాధించేందకు కృషి చేశాడు. అతనికి కొత్త కుర్రాడు లలిత్‌ యాదవ్‌(20 బంతుల్లో 24; 3 ఫోర్లు) తోడు అందించాడు.

నిలదొక్కుకున్నారు అనుకున్నసమయంలో 12.4 ఓవర్లో అనవసర పరుగు కోసం ప్రయత్నించి రిషభ్ పంత్ ఔటయ్యాడు. ఆ తరువాత 14.5 ఓవర్లో మోర్రిస్ బౌలింగ్ రాహుల్ కి క్యాచ్ ఇచ్చి లలిత్ యాదవ్ కూడా పెవివిలియన్ చేరాడు. ఇక చివర్లో టామ్ కుర్రేన్ 21(16 బంతుల్లో 2ఫోర్లు) తో కొంచెం పర్వాలేదనిపించాడు. చివరికి 20 ఓవర్లలో 147 పరుగులు చేసి 8 వికెట్లు కొల్పోయింది.

ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ 3 వికెట్లు తీయగా, రహ్మాన్ 2 వికెట్లు, మోర్రిస్ 1 వికెట్ తీశారు.

Tags:    

Similar News