పరువు కోసం ఆరాటం.. టాప్ 2 కోసం పోరాటం.. నేడు హైదరాబాద్ తో బెంగుళూరు "ఢీ"..

* అబుదాభి వేదికగా నేడు రాయల్ ఛాలెంజర్స్ - సన్ రైజర్స్ హైదరాబాద్ పోరు

Update: 2021-10-06 11:01 GMT

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్(ట్విట్టర్ ఫోటో)

RCB vs SRH: ఇప్పటివరకు రసవత్తరంగా సాగిన ఐపీఎల్ 2021 లీగ్ మ్యాచ్ లు మరో రెండు రోజుల్లో పూర్తయి పాయింట్స్ టేబుల్ లోని టాప్-4 జట్లు ప్లేఆఫ్ లోకి అడుగుపెట్టనున్నాయి. బుధవారం అబుదాభి వేదికగా షేక్ జాయద్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది.

ఇప్పటికే ప్లేఆఫ్ కి చేరిన బెంగుళూరు జట్టుతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు జరగనుంది నామమాత్రపు మ్యాచ్ అయిన బెంగుళూరు జట్టు మాత్రం మిగిలిన రెండు మ్యాచ్ లలో ఘనవిజయం సాధించి చెన్నై సూపర్ కింగ్స్ తన చివరి మ్యాచ్ లో ఓడిపోతే టాప్ 2 లో నిలిచే అవకాశం ఉండటంతో రానున్న రెండు మ్యాచ్ లలో గెలుపొందాలని బెంగుళూరు జట్టు పట్టుదలతో ఉంది.

వరుసగా హ్యాట్రిక్ విజయాలతో మంచి ఊపుమీదున్న కోహ్లిసేన.. ఈరోజు జరనున్న మ్యాచ్ లో గెలుపొందితే ఐపీఎల్ లో 100 విజయాలు సాధించిన జట్టుగా నాలుగో స్థానంలో నిలవనుంది. మొదటి స్థానంలో ముంబై ఇండియన్స్, రెండో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్, మూడో స్థానంలో కలకత్తా నైట్ రైడర్స్ లు ఐపీఎల్ లో అత్యధిక విజయాలతో ముందు వరుసలో ఉన్నాయి. బెంగుళూరు జట్టు కోహ్లి, పడిక్కల్, మాక్స్‌వెల్ తో టాప్ ఆర్డర్ బ్యాటింగ్ పటిష్టంగా ఉండటంతో పాటు పేస్ లో హర్షల్ పటేల్ స్పిన్ లో చాహల్ తో మ్యాచ్ ని టర్న్ చేసే మంచి బౌలర్స్ ఉన్నారు.

ఇక మొదటి నుండి బ్యాటింగ్ లో తడబడుతున్న హైదరాబాద్ ఆటగాళ్ళు అటు బౌలింగ్ లోను సరైన ప్రదర్శన కనబరచక ఈ టోర్నీలో 12 మ్యాచ్ లలో కేవలం 2 మ్యాచ్ లలో గెలిచి నాలుగు పాయింట్లతో పాయింట్స్ పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు హైదరాబాద్ - బెంగుళూరు తలపడిన మ్యాచ్ లలో 10 మ్యాచ్ లలో హైదరాబాద్ జట్టు, 8 మ్యాచ్ లలో బెంగుళూరు జట్టు విజయాన్ని సాధించాయి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు: విరాట్ కోహ్లీ (సి), దేవదత్ పడిక్కల్, శ్రీకర్ భారత్, గ్లెన్ మాక్స్‌వెల్, ఎబి డివిలియర్స్, డేనియల్ క్రిస్టియన్, షహబాజ్ అహ్మద్, జార్జ్ గార్టన్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్ మరియు మహ్మద్ సిరాజ్.

సన్ రైజర్స్ హైదరాబాద్: జాసన్ రాయ్, సాహా, కేన్ విలియమ్సన్ (సి), ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ/సిద్దార్థ్ కౌల్, ఉమ్రాన్ మాలిక్

Tags:    

Similar News