Prithvi Shaw: పృథ్వీ షా అరుదైన రికార్డు

Prithvi Shaw: ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ పృథ్వీ షా అరుదైన రికార్డును అందుకున్నాడు.

Update: 2021-04-30 15:10 GMT

పృథ్వీ షా (ఫొటో ట్విట్టర్)

Prithvi Shaw: ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ పృథ్వీ షా అరుదైన రికార్డును అందుకున్నాడు. గురువారం ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్‌ చరిత్రలో వెయ్యి పరుగులు చేసిన రెండో అతి పిన్న వయస్కుడిగా పృథ్వీ షా(21 ఏండ్ల, 169 రోజులు) రికార్డు సృష్టించాడు. ఈ జాబితా మొదటి స్థానంలో ఢిల్లీ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌(20ఏండ్ల 218 రోజులు ) ఉన్నాడు. మూడో స్థానంలో రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ సామ్సన్‌(21 ఏండ్ల 183 రోజులు) ఉండగా, నాలుగో స్థానంలో కేకేఆర్‌ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌(21 ఏండ్ల 222 రోజులు) ఉన్నాడు. ఇక ఐదో స్థానంలో ఆర్‌సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి( 22 ఏండ్ల 175 రోజులు) ఉన్నాడు.

పృథ్వీ షా 2018లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ద్వారా తన ఐపీఎల్‌ కెరీర్‌ను ప్రారంభించాడు. ఇప్పటి వరకు ఈ ఢిల్లీ బ్యాట్స్‌మెన్ 44 మ్యాచ్‌ల్లో 1013 పరుగులు సాధించాడు. అందులో 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోపీలో భాగంగా ఆసీస్‌తో మ్యాచ్‌ కు ఎంపికయ్యాడు. కానీ, ఆ మ్యాచ్ లో డకౌట్‌ అయి తీవ్ర విమర్శల పాలయ్యాడు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరిగిన విజయ్‌ హజారే ట్రోఫీలో నాలుగు సెంచరీలతో మరలా ఫాంలోకి వచ్చాడు. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ధావన్‌కు జోడీగా పృథ్వీ బౌలర్లను ఊచకోత కోస్తూ... ఢిల్లీ విజయాలలో కీలకంగా మారుతున్నాడు.

Tags:    

Similar News