IPL 2021: టాస్‌ గెలిచిన ముంబై.. సన్‌రైజర్స్ జట్టులో నాలుగు మార్పులు

IPL 2021: టాస్‌ గెలిచిన ముంబయి ఇండియన్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయించుకుంది.

Update: 2021-04-17 13:54 GMT

Sunrisers Hyderabad, Mumbai Indians 

IPL 2021: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ 2021 చెన్నై వేదికగా శనివారం మరో ఆసక్తికర పోరుకు తెరలేచింది. చెపాక్ మైదానంలో ముంబై ఇండియన్స్‌, సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్‌ గెలిచిన ముంబయి ఇండియన్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయించుకుంది. గత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై చివరి వరకు పోరాడి విజయం సాధించిన ముంబయి ఇండియన్స్‌.. రెండో విజయంపై కన్నేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన సన్‌రైజర్స్‌..ఈ మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గాలనే కృతనిశ్చయంతో బరిలోకి దిగుతోంది.

ఈ మ్యాచ్‌లో ముంబై సారథి రోహిత్ ముగింట మరో అద్భుతమైన రికార్డ్ నిలిచివుంది. ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ పోరులో రోహిత్‌ ఇంకో 28 పరుగులు చేస్తే, టీ20ల్లో కెప్టెన్‌గా 4వేల పరుగులు పూర్తి చేసిన క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించనున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలో హిట్‌మ్యాన్‌ ఇప్పటి వరకు 202 మ్యాచ్‌ల్లో 5292 పరుగులు పూర్తి చేశాడు. అత్యధిక స్కోరు 109 కాగా, 39 అర్ధశతకాలు నమోదు చేశాడు. గత రెండు మ్యాచుల్లో బ్యాటింగ్ లో పూర్తిగా విఫలమైన ఓపెనర్, బ్యాట్స్ మెన్ సాహా ని తప్పించాలనే ఆలోచనలో యాజమాన్యం ఉందని తెలుస్తోంది. నాలుగు మార్పులు చేసింది. నటరాజన్, సాహా, హోల్డర్, నదీమ్ లను పక్కన పెట్టింది. మరో వైపు ముంబై జట్టులో ఒక మార్పు చేసింది. 

ముంబై ఇండియన్స్:

రోహిత్ శర్మ(కెప్టెన్), డికాక్ (కీపర్), సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్థిక్ పాండ్య, పోలార్డ్, కృనాల్ పాండ్యా, ఆడమ్ మిలాన్, రాహుల్ చాహర్, బౌల్ట్, బూమ్రా

సన్‌రైజర్స్ హైదరాబాద్:

డెవిడ్ వార్నర్ (కెప్టెన్), బెయిర్ స్టో (కీపర్), మనీష్ పాండే, విజయ్ శంకర్, విరాట్ సింగ్, రషీద్ ఖాన్, అభిషేక్ శర్మ, రెహ్మాన్, భూవనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మాద్,

Tags:    

Similar News