PBKS vs KKR: పంజాబ్ పై కోల్‌కతా విజయం; రాణించిన త్రిపాఠి, మోర్గాన్

IPL 2021, PBKS vs KKR: పంజాబ్ కింగ్స్ పై కోల్‌కతా టీం 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

Update: 2021-04-26 17:38 GMT

పంజాబ్ టీం పై 5 వికెట్ల తేడాతో కోల్‌కతా విజయం (ఫొటో ట్విట్టర్)

IPL 2021, PBKS vs KKR: పంజాబ్ కింగ్స్ పై కోల్‌కతా టీం 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. లక్ష్యం చిన్నదైనా కోల్‌కతా బ్యాట్స్‌మెన్స్ తడబడ్డారు. త్రిపాఠి(41), మోర్గాన్(47) రాణించడంతో విజయం సాధ్యమైంది.

124 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ 10 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. హెన్రిక్స్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లోనే నితీష్‌ రానా డకౌట్‌గా వెనుదిరగ్గా... షమీ వేసిన రెండో ఓవర్‌లో 9 పరుగులు చేసిన గిల్‌ ఎల్బీగా అవుటయ్యాడు.

అనంతరం బ్యాటింగ్ వచ్చిన సునీల్ నరైన్ అర్షదీప్‌ వేసిన ఇన్నింగ్స్‌ 3వ ఓవర్‌ చివరి బంతికి డకౌట్‌గా వెనుదిరిగాడు. డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా నరైన్‌ భారీ షాట్‌కు యత్నించాడు. అయితే రవి బిష్ణోయ్‌ చాలా దూరం ముందుకు పరిగెత్తుకు వచ్చి డైవ్‌ చేస్తూ అద్భుత క్యాచ్‌ను అందుకున్నాడు.

రాహుల్‌ త్రిపాఠి, మోర్గాన్‌ ఇన్నింగ్స్‌ను నిర్మించే పనిలో పడి, ధాటిగానే పరుగలు రాబట్టారు. ఈ జోడీ అద్భుతంగా ఆడుతున్న తరుణంలో దీపక్ హుడా విడదీశాడు. రాహుల్‌ త్రిపాఠి( 42 పరుగులు, 32 బంతులు, 7ఫోర్లు) రూపంలో కేకేఆర్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. దీపక్‌ హుడా వేసిన ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌ చివరి బంతిని షాట్‌ ఆడే ప్రయత్నంలో షారుఖ్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన ఆండ్రూ రస్సెల్(10పరుగులు, 9 బంతులు, 2ఫోర్లు) నిరాశపరిచాడు. 14.1 ఓవర్లో రనౌట్ గా వెనుదిరిగాడు.

ఇయాన్ మోర్గాన్ (47 పరుగులు, 40 బంతులు, 4ఫోర్లు, 2 సిక్స్), దినేష్ కార్తిక్(12) నిలకడగా ఆడుతూ.. కోల్‌కతాను విజయతీరాలకు చేర్చారు.

పంజాబ్ బౌలర్లలో హెన్రిక్స్, షమీ, అర్షదీప్ సింగ్, దీపక్ హుడా తలో వికెట్ పడగొట్టారు.

అంతకు ముందు పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ కేకేఆర్‌ బౌలర్ల దాటికి వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. ఒక దశలో వంద పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది. అయితే చివర్లో క్రిస్‌ జోర్డాన్‌(18 బంతుల్లో 30 పరుగులు; 3 సిక్సర్లు, 1 ఫోర్‌) వేగంగా ఆడడంతో కనీసం ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఓపెనర్‌ మయాంక్‌ 31 పరుగులు చేశాడు. కేకేఆర్‌ బౌలర్లలో ప్రసిధ్‌ కృష్ణ 3, కమిన్స్‌, నరైన్‌ చెరో 2, మావి, వరుణ్‌ చక్రవర్తి తలా ఒక వికెట్‌ తీశారు. 

Tags:    

Similar News