IPL 2021: సన్‌రైజర్స్‌ సత్తా సరిపోలేదు..కోల్‌కతా నైట్‌రైడర్స్ బోణీ

IPL 2021: కోల్‌కతా నైట్‌రైడర్స్‌‌(కేకేఆర్‌)తో జరిగిన మూడో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పరాజయం పాలైంది.

Update: 2021-04-12 01:24 GMT

 Indian Premier League 2021 

IPL 2021: ఐపీఎల్ సీజన్ 2021 ఎడిషన్ 14లో చెన్నై వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌‌(కేకేఆర్‌)తో జరిగిన మూడో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పరాజయం పాలైంది. గత ఐదు సీజన్‌లలో నిలకడగా ఆడుతున్న సన్‌రైజర్స్‌ ఈసారి శుభారంభం లభించలేదు. 10 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో ఓడింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు సాధించింది. నితీశ్‌ రాణా (56 బంతుల్లో 80; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు), రాహుల్‌ త్రిపాఠి (29 బంతుల్లో 53; 5 ఫోర్లు 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. సన్‌రైజర్స్‌ రషీద్‌ ఖాన్, నబీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

అనంతరం హైదరాబాద్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 177 పరుగులే పరిమితం అయ్యింది. మనీశ్‌ పాండే (44 బంతుల్లో 61 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), బెయిర్‌స్టో (40 బంతుల్లో 55; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో పోరాడినా హైదరాబాద్‌ను విజయన్ని చేకూర్చలేకపోయారు. చివర్లో అబ్దుల్‌ సమద్‌ (8 బంతుల్లో 19 నాటౌట్‌; 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. హైదరాబాద్‌ విజయానికి చివరి ఓవర్లో 22 పరుగులు అవసరం కాగా... రసెల్‌ వేసిన కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 11 పరుగులే ఇచ్చాడు. దాంతో సన్ రైజర్స్ ఓటమి ఖాయమైంది. కోల్‌కతా బౌలర్లలో ప్రసిధ్‌ కృష్ణ రెండు వికెట్లు తీయగా... కమిన్స్‌, షకీబుల్, రస్సెల్ తలా ఓ వికెట్ పడగొట్టారు. నితీశ్ రాణా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎంపికైయ్యాడు. 

Tags:    

Similar News