PBKS vs KKR: క్యాచ్ లను వదిలి మ్యాచ్ ని చేజార్చుకున్న కలకత్తా నైట్ రైడర్స్

* హోరాహోరి పోరులో కలకత్తా నైట్ రైడర్స్ పై ఘన విజయం సాధించిన పంజాబ్ కింగ్స్

Update: 2021-10-02 08:20 GMT

క్యాచ్ లను వదిలి మ్యాచ్ ని చేజార్చుకున్న కలకత్తా నైట్ రైడర్స్(ట్విట్టర్ ఫోటో)

PBKS vs KKR: "క్యాచెస్ విన్ మ్యాచెస్".. ఇప్పుడు ఈ మాట పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కలకత్తాకి బాగానే అర్ధం అయి ఉంటుందని తెలుస్తుంది. పంజాబ్ కింగ్స్ - కలకత్తా నైట్ రైడర్స్ మధ్య శుక్రవారం జరిగిన కీలక మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు ఘనవిజయం సాధించి ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కలకత్తా జట్టులో ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ మరోసారి తన అద్భుత ఇన్నింగ్స్ తో అభిమానులను ఆకట్టుకున్నాడు. కేవలం 49 బంతుల్లో 67 పరుగులు సాధించి కలకత్తా జట్టు భారీ స్కోర్ సాధించడంలో ప్రధాన పాత్ర పోషించాడు.

మరో ఓపెనర్ శుభ్ మాన్ గిల్ 7 పరుగులకే అర్షదీప్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయి తన పేలవ ప్రదర్శనతో అభిమానులను మరోసారి నిరాశపరిచాడు. ఇక మిడిల్ ఆర్డర్ లో రాహుల్ త్రిపాటి (34), నితీష్ రాణా (31) తమ బ్యాటింగ్ తో ఫర్వాలేదనిపించారు. దీంతో 20 ఓవర్లు ముగిసేసరికి కలకత్తా నైట్ రైడర్స్ 165 పరుగులకు 7 వికెట్లను కోల్పోయింది. 166 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టుకు ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ శుభారంభాన్ని అందించారు.

చాలారోజుల తరువాత పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ లో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరోపక్క కలకత్తా ఆటగాళ్ళు మాత్రం వరుస క్యాచ్ లను చేజార్చుస్తూ ఓటమిని చవిచూశారు. శివం మావి వేసిన 17 ఓవర్ లో షారుఖ్ ఖాన్ క్యాచ్ ని వెంకటేష్ అయ్యర్ బౌండరీ లైన్ వద్ద వదిలేయడంతో పాటు చివరి ఓవర్లో రాహుల్ త్రిపాటి కూడా షారుఖ్ క్యాచ్ ని జారవిడచడంతో అది సిక్స్ గా మారి పంజాబ్ కింగ్స్ కు విజయాన్ని చేకూర్చింది. ఇలా మొదటి నుండి ఫీల్డింగ్ లోపాలతో క్యాచ్ లను జారవిడుస్తూ చివరికి మ్యాచ్ ని చేజార్చుకున్నారు కలకత్తా నైట్ రైడర్స్ ఆటగాళ్ళు.

Tags:    

Similar News