ఐపీఎల్‌-2021 : ఫిబ్రవరి 11న మినీ వేలం.. టోర్నీ ఎక్కడంటే ?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌14వ సీజన్ 2021 ముందు ఆటగాళ్ల వేలాన్ని వచ్చే నెలలో నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Update: 2021-01-07 11:54 GMT

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌14వ సీజన్ 2021 ముందు ఆటగాళ్ల వేలాన్ని వచ్చే నెలలో నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. మినీ వేలం ఫిబ్రవరి 11న నిర్వహించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇప్పటికే ప్రాథమికంగా ఓ నిర్ధారణకి వచ్చేసినట్లు సమాచారం. ఈ ఏడాది ఐపీఎల్ మార్చి-మే నెల మధ్యలో జరిగే అవకాశం ఉంది. ఈ సారి ఐపీఎల్ భారత్ లోనే జరగనుంది. ఫిబ్రవరి11 నుంచి మినీ వేలం నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఫ్రాంచైజీలు ఆటగాళ్ల బదిలీ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించినట్లు, ఈ నెల 20 లోపు తమకు అవసరం లేదనుకున్న ఆటగాళ్లను రిలీజ్ చేయాలని సూచించినట్లు సమాచారం.

కాగా.. ఈ నెల 20లోపు టోర్నీలోని అన్ని ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకునే ఆటగాళ్లు, వేలంలోకి విడిచిపెట్టే ఆటగాళ్ల జాబితాని అందజేయాల్సి ఉంటుంది. ఐపీఎల్ ‌14వ సీజన్ భారత్‌లో నిర్వహించేందుకే తొలి ప్రాధాన్యతనిస్తున్నట్లు సమాచారం. అయితే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీ విజయవంతం కావడంపై ఐపీఎల్ భవితవ్యం ఆధారపడి ఉంది. బబుల్‌ నిబంధనలతో ఆరు నగరాల్లో నిర్వహిస్తున్న ఈ టోర్నీ.. సజావుగా సాగితే ఐపీఎల్‌కు ఎలాంటి ఆటంకాలు ఉండకపోవచ్చు. ఐపీఎల్ సీజన్ 13 బయోబుడగ నీడలో యూఏఈ వేదికగా జరిగిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News