IPL 2020 Match 10 Updates : దూకుడుగా ఆడిన బెంగళూరు.. ముంబాయి విజయలక్ష్యం 202

IPL 2020 Match 10 Updates : విరాట్ కోహ్లీ సారధ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత ఓవర్లలో 201 పరుగులు సాధించింది. దీంతో ముంబాయి జట్టు 202 పరుగుల టార్గెట్ చెధించాలి.

Update: 2020-09-28 16:06 GMT

ఐపీఎల్ లో పరుగుల వరద కొనసాగుతోంది. నిన్న జరిగిన మ్యాచ్ లో రెండు జట్లు రెండు వందలకు పైగా పరుగులు సాధించిన తీరును స్ఫూర్తిగా తీసుకున్నారేమో.. బెంగళూరు బ్యాట్స్ మెన్ రెచ్చిపోయారు. బ్యాటింగ్ చేసిన ఐదుగురు బ్యాట్స్ మెన్ లో ముగ్గురు అర్ధ సెంచరీలు సాధించారు. ఒకరు సూపర్ ఫినిషింగ్ సిక్స్ లు కొట్టారు. దీంతో ముంబయి టీం కు 202 పరుగుల విజయలక్ష్యాన్ని ఇచ్చారు. ప్రారంభం నుంచే బెంగళూరు బ్యాట్స్ మెన్ వేగంగా బ్యాటింగ్ చెయడం ప్రారంభించారు. ఫించ్ అవుటయ్యే ప్రమాదం నుంచి రెండు సార్లు బయట పడ్డాడు. ఆతరువాత ఇక రేచిపోయాడు. దీంతో వేగంగా తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తరువాత వచ్చిన కెప్టెన్ కోహ్లీ మూడు పరుగులకే వికెట్ సమర్పించుకున్నాడు. అయినా, పడిక్కల్..డివిలియర్స్ ఎక్కడా తగ్గకుండా ఆడారు. ఈ క్రమంలో పడిక్కల్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని అవుటయ్యాడు. ఇక తరువాత డివిలియర్స్ కి దూబే జత కూడాడు. ఇక డివిలియర్స్ బాదుడు మొదలెట్టాడు. వరుస సిక్స్ లతో విరుచుకుపడి తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక చివరి ఓవర్లో మూడు సిక్స్ లు బాడి దూబే కూడా ఓ చేయి వేయడంతో బెంగళూరు మంచి స్కోరు సాధించింది.

బెంగళూరు బ్యాటింగ్ సాగింది ఇలా..

* ట్రెంట్‌బౌల్ట్‌ వేసిన తొలి ఓవర్‌లో బెంగళూరు 8 పరుగులు రాబట్టింది.

* పాటిన్‌సన్‌ వేసిన రెండో ఓవర్‌లో తొలి బంతికి రెండు పరుగులు తీసిన ఆరోన్‌ ఫించ్‌(9) తర్వాతి బంతికి గాయపడ్డాడు. బంతి అతడికి కడుపు కింద భాగంలో బలంగా తగలడంతో వెంటనే కిందపడిపోయాడు. కొద్ది క్షణాల్లోనే అతడు మళ్లీ బ్యాట్‌ పట్టడంతో పెను ప్రమాదం తప్పింది. తర్వాత మరో బౌండరీ కొట్టడంతో పాటు ఇంకో డబుల్‌ రన్‌ తీశాడు. దీంతో ఈ ఓవర్‌లో మొత్తం 8 పరుగులు లభించాయి. 2 ఓవర్లకు బెంగళూరు స్కోర్‌ 16/0

* రాహుల్‌ చాహర్‌ వేసిన ఐదో ఓవర్‌లో బెంగళూరు 14 పరుగులు రాబట్టింది. ఫించ్‌ వరుసగా మూడు ఫోర్లు బాదాడు. దీంతో ఈ ఓవర్‌లో 14 పరుగులు వచ్చాయి. 5 ఓవర్లకు బెంగళూరు స్కోర్‌ 49/0కి చేరింది.

* ఆరోన్‌ ఫించ్‌ 31 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. మరోవైపు దేవ్‌దత్‌ పడిక్కల్‌(17) అతడికి మంచిగా సహకరించాడు. దీంతో వీరిద్దరూ 8 ఓవర్లకు 74 పరుగులు చేశారు.

* బౌల్ట్‌ వేసిన 9వ ఓవర్‌లో బెంగళూరు తొలి వికెట్‌ కోల్పోయింది. ఆరోన్‌ ఫించ్‌(52) ధాటిగా ఆడే క్రమంలో పొలార్డ్‌ చేతికి చిక్కాడు. 9 ఓవర్లకు బెంగళూరు జట్టు స్కోర్‌ 81/1.

* చాహర్ వేసిన 13 వ ఓవర్లో కోహ్లీ (3) రోహిత్‌కు సులువైన క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 13 ఓవర్లకు బెంగళూరు 96/2

* 16 వ ఓవర్లో పొలార్డ్‌ వేసిన రెండో బంతిని పడిక్కల్‌ బౌండరీ సాధించి అర్ధశతకం అందుకున్నాడు. 16 ఓవర్లకు బెంగళూరు 136/2

* బుమ్రా వేసిన 17వ ఓవర్‌లో బెంగళూరు 18 పరుగులు సాధించింది. డివిలియర్స్‌(37) ఈ ఓవర్‌లో రెండు సిక్సులు, ఒక బౌండరీ బాదడంతో పాటు రెండు పరుగులు వచ్చాయి. దీంతో ఈ ఓవర్‌ పూర్తయ్యేసరికి ఆ జట్టు స్కోర్‌ 154/2కి చేరింది.

* ట్రెంట్‌బౌల్ట్‌ వేసిన 18వ ఓవర్‌ తొలి బంతికి భారీ షాట్‌ ఆడబోయిన పడిక్కల్‌(54) బౌండరీ లైన్‌ వద్ద పొలార్డ్‌ చేతికి చిక్కాడు. 18 ఓవర్లకు బెంగళూరు స్కోర్‌164/3

* బుమ్రా వేసిన 19వ ఓవర్‌లో బెంగళూరు 17 పరుగులు రాబట్టింది. ఈ ఓవర్లో డివిలియర్స్‌ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 19 ఓవర్లకు ఆ జట్టు స్కోర్‌ 181/3కి చేరింది.

* ఇక చివరి ఓవర్లో దూబే మూడు సిక్స్లు బాదాడు.. తానాడిన పది బంతులకు 27 పరుగులు చేశాడు. దీంతో ముంబాయి ముందు 202 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది బెంగళూరు.

RCB vs MI ఐపీఎల్ 2020 మ్యాచ్ లైవ్ అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Tags:    

Similar News