IPL 2020: అందుకే ఓడిపోయాం: శ‌్రేయస్ అయ్య‌ర్

IPL 2020: ఐపీఎల్2020 భాగంగా మంగ‌ళ‌వారం ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ పంజాబ్ ల మ‌ధ్య జ‌రిగిన పోరులో కింగ్స్ లెవ‌న్ పంజాబ్ పై చేతి సాధించింది. శిఖ‌ర్ ధావ‌న్ అద్భుతంగా రాణించి, శ‌తకం చేసినా.. వృథా అయింది.

Update: 2020-10-21 06:21 GMT

IPL 2020: ఐపీఎల్2020 భాగంగా మంగ‌ళ‌వారం ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ పంజాబ్ ల మ‌ధ్య జ‌రిగిన పోరులో కింగ్స్ లెవ‌న్ పంజాబ్ పై చేతి సాధించింది. శిఖ‌ర్ ధావ‌న్ అద్భుతంగా రాణించి, శ‌తకం చేసినా.. వృథా అయింది. ఈ మ్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. తమ ఓటమికి గల కారణాలను తెలియజేశాడు. ఫీల్డింగ్ వైఫల్యం, బ్యాటింగ్‌లో 10 రన్స్ తక్కువ చేయడం, పవర్‌ప్లేలో భారీగా పరుగులిచ్చుకోవడంతోనే కింగ్స్ పంజాబ్ చేతిలో ఓటమి చవిచూశామని చెప్పుకోచ్చారు.

శిఖర్ ధావ‌న్ అద్భుత‌మైన బ్యాటింగ్ మాకు ప్ల‌స్ పాయింట్. పిచ్‌ను శిఖర్ అద్భుతంగా అర్ధం చేసుకున్నాడు. పరిస్థితులను ఆకలింపు చేసుకోని చెలరేగాడు. క్రీజులోకి వచ్చిన కొత్త బ్యాట్స్‌మెన్ వికెట్ పరిస్థితి తెలియజేశాడు. నెమ్మదిగా ఉందని గైడ్ చేశాడు. ఇతరుల కంటే అతను పరిస్థితులను త్వరగా అందిపుచ్చుకున్నాడు. కానీ, తుషార్ చాలా పరుగులిచ్చాడు. అతను ఖచ్చితంగా తిరిగి గాడిన పడుతాడని ఆశిస్తున్నాం. ఫీల్డింగ్‌లో కూడా మేం విఫలమయ్యాం. దాంతో తదుపరి మ్యాచ్‌కు మేం మరింత సిద్దం కావాల్సిన అవసరం ఉందని స్పష్టమైంది. ముందు ముందు ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకుంటాం.'అని అయ్యర్ చెప్పుకొచ్చాడు.

టాస్‌ నెగ్గి మొదట బ్యాటింగ్‌ చేపట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. పంజాబ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' శిఖర్‌ ధావన్‌ (61 బంతుల్లో 106 నాటౌట్‌) ఒక్కడే చెలరేగాడు. వీరోచిత శతకంతో ఆఖరి దాకా స్కోరుబోర్డును నడిపించాడు.

Tags:    

Similar News