Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే వరుసగా క్రికెట్ టీంలకు షాక్.. రెండ్రోజుల్లో ముగ్గురికి తీవ్రగాయాలు

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ఇంకా 10 రోజుల సమయం కూడా లేదు. ఇప్పటివరకు చాలా మంది స్టార్ ఆటగాళ్లు గాయాల కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యారు.

Update: 2025-02-10 10:38 GMT

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే వరుసగా క్రికెట్ టీంలకు షాక్.. రెండ్రోజుల్లో ముగ్గురికి తీవ్రగాయాలు

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ఇంకా 10 రోజుల సమయం కూడా లేదు. ఇప్పటివరకు చాలా మంది స్టార్ ఆటగాళ్లు గాయాల కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యారు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో పేర్లు ప్రకటించిన వివిధ జట్ల నుండి మరో ముగ్గురు ఆటగాళ్లు గాయపడ్డారు. దీంతో ఆయా జట్లలో ఆందోళన నెలకొంది. రెండు రోజుల్లో ముగ్గురు ఆటగాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఆటగాళ్లు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడటానికి దాదాపు అందుబాటులో ఉండకపోవచ్చు. ఐసిసి టోర్నమెంట్‌లో ఆడడం డౌటే అని అనిపించే ఆ ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.

జాకబ్ బెథెల్ స్థానంలో టామ్ బాంటన్

జాకబ్ బెథెల్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇంగ్లాండ్ జట్టులో ఆటగాడు. భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో అతను 64 బంతుల్లో 51 పరుగులు చేశాడు కానీ తొడ కండరాల గాయం కారణంగా, అతను రెండవ వన్డే ఆడలేకపోయాడు. ఇప్పుడు టామ్ బాంటన్ మూడవ మ్యాచ్ ఆడబోతున్నాడు. గాయం కారణంగా జాకబ్ తదుపరి వన్డే, ఛాంపియన్స్ ట్రోఫీ ఆడటం కష్టమేనని తెలుస్తోంది.

రచిన్ రవీంద్ర నుదిటికి కుట్లు

2025 ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్తాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు నాలుగు మ్యాచ్‌ల ట్రై-సిరీస్ ఆడుతున్నాయి. ఈ ముక్కోణపు సిరీస్ ఫిబ్రవరి 8న న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌తో ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ 38వ ఓవర్లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు, ఖుస్దిల్ షా వేసిన షాట్‌ను క్యాచ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా, బంతి రచిన్ రవీంద్ర ముఖానికి తగిలి అతని ముఖం నుండి రక్తస్రావం మొదలైంది. ఆ తరువాత రవీంద్ర మైదానం నుండి వెళ్లిపోవాల్సి వచ్చింది. రవీంద్ర తలకు కుట్లు పడ్డాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 10న దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ ఆడడం కూడా డౌటే.

పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ రవూఫ్

న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా, పాకిస్తాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రౌఫ్ కూడా గాయపడ్డాడు. 37వ ఓవర్లో బౌలింగ్ చేస్తున్నప్పుడు ఛాతీ నొప్పితో బాధపడుతూ అతను మైదానం విడిచి వెళ్ళవలసి వచ్చింది. హారిస్ కు స్వల్ప సైడ్ స్ట్రెయిన్ ఉందని పీసీబీ తెలియజేసింది. అతను తదుపరి మ్యాచ్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడుతాడా లేదా అన్న సందేహాలు ఉన్నాయి.

ఆస్ట్రేలియాది అదే పరిస్థితి

త్వరలో జరగబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు పెద్ద షాక్ తగిలింది. జట్టులో కీలక ఆటగాళ్లుగా ఉన్న కెప్టెన్ పాట్ కమిన్స్, ప్రముఖ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ టోర్నమెంట్‌కు దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆల్‌రౌండర్ మిచ్ మార్ష్ గాయంతో తప్పుకోగా, ఇప్పుడు కమిన్స్, హేజిల్‌వుడ్ కూడా లేనట్లయితే ఆస్ట్రేలియాకు ఇది మరింత కష్టంగా మారనుంది.కమిన్స్ గాయం బారిన పడిన నేపథ్యంలో జట్టుకు కొత్త కెప్టెన్‌ను ఎన్నుకోవాల్సి ఉండొచ్చని ఆస్ట్రేలియా కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ వెల్లడించారు.

Tags:    

Similar News