Indian Womens Team: 14 నెలలైనా ప్రైజ్‌మనీ అందలేదు..!

Indian Womens Team: టీం ఇండియా ఉమెన్స్ టీం 2020లో టీ20 ప్రపంచ కప్ టోర్నీలో రన్నరప్ గా నిలిచింది.

Update: 2021-05-24 10:16 GMT

టీం ఇండియా ఉమెన్స్ (ఫొటో ట్విట్టర్)

Indian Womens Team: టీం ఇండియా ఉమెన్స్ టీం 2020లో టీ20 ప్రపంచ కప్ టోర్నీలో రన్నరప్ గా నిలిచింది. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఈ టోర్నీ పూర్తయ్యి 14 నెలలు గడుస్తోంది. అయితే టీం ఇండియా ఉమెన్స్ కు 5 లక్షల డాలర్ల ప్రైజ్ మనీ రావాల్సి ఉంది. కానీ, నేటి వరకు ఆ ప్రైజ్ మనీ టీం ఇండియా ఉమెన్స్‌కు ఇంత వరకు అందలేదు.

ఈ మేరకు ఐసీసీ రన్నరప్‌ ప్రైజ్‌మనీ మొత్తం 5 లక్షల డాలర్లను (రూ. 3 కోట్ల 64 లక్షలు) బీసీసీఐ కి గతేడాది ఏప్రిల్‌లోనే అందజేసింది. అయితే, బీసీసీఐ మాత్రం అమ్మాయిలకు ఆ మొత్తాన్ని నేటి వరకు ఇవ్వలేదు.

అయితే, మహిళా క్రికెటర్లపై బోర్డు నిర్లక్ష్యం వహిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. కాగా, ఐసీసీ టోర్నమెంట్‌ లో ఈవెంట్‌ పూర్తయిన ఏడు రోజుల్లోనే ఐసీసీ ప్రైజ్‌మనీని ఆయా దేశాల బోర్డులకు పంపిస్తుంది. నిధులు అందిన రెండు వారాల్లోనే ఆటగాళ్లకు నిధులు అందిస్తాయి బోర్డులు. కానీ, బీసీసీఐ అమ్మాయిలకు మాత్రం పంపిణీ చేయకుండా ఖజానాలోనే ఉంచుకుంది. కాగా, ఆస్ట్రేలియా టీంకు.. గతేడాది ఏప్రిల్‌లోనే అందించగా, ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు కూడా గతేడాది మేలోనే ప్రైజ్‌మనీని అందించాయి.

వారంలో అందజేస్తాం: బీసీసీఐ

ఓ బ్రిటన్‌ పత్రికలో వచ్చిన ఈ కథనంతో బీసీసీఐపై విమర్శలొస్తున్నాయి. ఈ మేరకు స్పందించిన బోర్డు ప్రైజ్‌మనీని అందించలేదని అంగీకరించింది. వారం రోజుల్లోనే మహిళా క్రికెటర్లకు అందిస్తామని తెలిపింది. కరోనాతో ఆలస్యమయ్యాయని, అలాగే పెండింగ్‌లో ఉన్న పురుషుల, మహిళల కాంట్రాక్టు ఫీజులు, దేశవాళీ ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులు, వార్షిక చెల్లింపులున్నీ పూర్తిచేస్తామని పేర్కొంది.

Tags:    

Similar News