Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్ హవా.. షూటింగ్‌లో మరో రెండు స్వర్ణాలు..

Asian Games 2023: 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో పాలక్ స్వర్ణం.. ఇషా సింగ్‌కు రజత పతకం

Update: 2023-09-29 07:36 GMT

Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్ హవా.. షూటింగ్‌లో మరో రెండు స్వర్ణాలు.. 

Asian Games 2023: ఆసియా గేమ్స్‌‌లో భారత ఆటగాళ్లు అదరగొడుతున్నారు. పతకాల వేటలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఆసియా క్రీడల్లో భారత షూటర్ల హవా కొనసాగుతోంది. ఇవాళ రెండు స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ విభాగంలో ఇషా సింగ్, పాలక్‌, దివ్య తడిగోల్ బృందం రజతం కైవసం చేసుకుంది. వ్యక్తిగత మహిళల విభాగంలోనూ పాలక్ స్వర్ణం, ఇషా సింగ్‌ రజత పతకాలు దక్కించుకున్నారు.

పురుషుల 50 మీటర్ల త్రీ పొజిషన్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఐష్వరి ప్రతాప్‌ సింగ్, స్వప్నిల్‌ కుశాలె, అఖిల్ షిరన్ బృందం గోల్డ్‌ సొంతం చేసుకుంది. భారత్‌ 1,769 పాయింట్లతో ప్రపంచ రికార్డును నమోదు చేసింది. ఇదే విభాగంలో వ్యక్తిగత ప్రదర్శనలోనూ భారత షూటర్లు ఫైనల్‌కు అర్హత సాధించారు. షూటింగ్‌లోనే భారత్‌కు 17 పతకాలు వచ్చాయి. ఇందులో ఆరు స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్య పతకాలు ఉన్నాయి.

టెన్నిస్‌ డబుల్స్‌లో భారత్‌ రజత పతకం సాధించింది. డబుల్స్‌ విభాగంలో సాకేత్‌ మైనేని, రామ్‌కుమార్‌ రామనాథన్‌ జోడీ సిల్వర్‌ గెలుచుకుంది. రామ్‌కుమార్‌కు ఆసియా క్రీడల్లో తొలి మెడల్‌ కాగా.. సాకేత్‌కి ఇది మూడోది కావడం విశేషం. ఇప్పటి వరకు ఆసియా క్రీడల్లో భారత పతకాల సంఖ్య 30కి చేరింది. దీంతో పతకాల పట్టికలో భారత్‌ నాలుగో స్థానానికి చేరుకుంది.

Tags:    

Similar News