IPL 2021: కోహ్లీ వర్సెస్ రోహిత్..గత 5 మ్యాచ్‌లో ఆదిపత్యం ఎవరిదంటే

IPL 2021:ఈ సారి ఐపీఎల్ సీజన్14 ప్రేక్షకులు లేకుండానే బయోబుడగ నీడలో జరగనున్నాయి.

Update: 2021-04-08 11:27 GMT

MI vs RCB(File Photo)

IPL 2021: ఐపీఎల్‌ మ్యాచులు ప్రారంభం అయ్యాయంటే చాలు ప్రతి క్రీడా అభిమానికి పండగే పండగ. ఆధ్యంతం ఉత్కంఠగా సాగే మ్యాచులు వీక్షకులకు వీనోదాన్ని పంచుతాయి. ఈ మెగా టీ20 లీగ్‌లో ప్లే ఆఫ్స్ కీలకఘట్టం. ఈ పొట్టి పార్మాట్లో లీగ్ మ్యాచుల్లో సత్తా చాటేందుకు అన్నిజట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే ఈసారి ప్లేఆఫ్స్​కు ముంబై, చెన్నై, ఆర్సీబీ, సన్ రైజర్స్ జట్లు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. 

ఈ సారి ఐపీఎల్ సీజన్14 ప్రేక్షకులు లేకుండానే బయోబుడగ నీడలో జరగనున్నాయి. ఈ సారి తొలి మ్యాచ్ రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్, కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. అయితే ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 29 మ్యాచులు జరిగాయి. 27 మ్యాచులు ఐపీఎల్ టోర్నీలో జరిగాయి. మరో రెండు మ్యాచ్‌లు చాంపియన్స్ లీగ్ టోర్నోలో జరిగాయి. ఇరు జట్లు తలపడిన మొత్తం 27 మ్యాచుల్లో 17 మ్యాచుల్లో ముంబై ఇండియన్స్ విజేయతగా నిలవగా..10 మ్యాచుల్లో మాత్రమే ఆర్సీబీ విజయం సాధించింది. ఇక చాంపియన్స్ లీగ్ ఈవెంట్ లో రెండు జట్లు తలపడగా ముంబై పైచేయి సాధించింది. ఎటు చూసిన ముంబై జట్టు బెంగళూరుపై ఆదిపత్యం చెలాయిందిం.

ఇక రెండు జట్లు తలపడిన చివరి ఐదు మ్యాచుల్లో రోహిత్ సేన మూడు మ్యాచుల్లో విజయం సాధించింది. రెండు మ్యాచుల్లో మాత్రం కోహ్లీ జట్టును విజయం వరించింది. చివరగా రెండు జట్లు గత ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్ 13లో తలపడ్డాయి. ఈ సీజన్ లో రెండు జట్లు చెరో విజయం ఖాతాలో వేసుకున్నాయి.

గత ఏడాది దుబాయ్ వేదికగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి పోరులో ముంబైపై బెంగళూరు సూపర్ ఓవర్ లో విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి రోహిత్ సేన ఫిల్డింగ్ ఎంచుకుంది. కోహ్లీ సారథ్యంలోని బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 201/3 పరుగులు చేసింది. దేవ్ దత్త్(54),ఫించ్(52), డివిలియర్స్ (55) హాఫ్ సెంచరీలు చేశారు. లక్ష్య చేధనలో రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 201పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (99), పోలార్డ్ (60) పరుగులతో రాణించారు. సూపర్ ఓవర్లో ముంబై 7/1 పరుగులకే పరిమితం అయింది. దీంతో కోహ్లీ సేన అలవకగా విజయం సాధించింది. రెండో మ్యాచ్ లో సూర్యకూమార్ యావ(79*) రాణించడంలో 164 పరుగుల లక్ష్యాన్ని ముంబై అలవొకగా చేధించింది.

కాగా.. రేపటి నుంచి తొలి మ్యాచ్ చెన్నై వేదికగా కోహ్లీ సేనతో, రోహిత్ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా ఈ గత సీజన్ మాదిరే ఈ సారి కూడా ప్రేక్షకులకు అనుమతి లేదు. 

Tags:    

Similar News