India Vs Australia: ఢిల్లీ టెస్టులో భారత్ ఘన విజయం
India Vs Australia: ఆస్ట్రేలియాపై 6 వికెట్ల తేడాతో భారత్ విజయం
India Vs Australia: ఢిల్లీ టెస్టులో భారత్ ఘన విజయం
India Vs Australia: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై 6 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. పుజారా 31 పరుగులు, శ్రీకర్ భరత్ 23 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. రోహిత్ శర్మ 31 పరుగులు, కోహ్లీ 20 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 12 పరుగులు చేశారు. అంతకుముందు టీమిండియా బౌలర్లు.. కంగారులకు చుక్కలు చూపించారు. మూడో రోజు 61 పరుగులతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్‌ను భారత స్పినర్లు జడేజా, అశ్విన్ వణికించారు. రెండో ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే ఆసీస్‌ను ఆలౌట్ చేశారు. జడేజా 7 వికెట్లు తీసి విశ్వరూపం చూపించాడు. అశ్విన్ మూడు వికెట్లు తీశాడు. అశ్విన్, జడేజా స్పిన్ జోరుకు ఆసీస్ బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టారు. ఏ ఒక్కరూ క్రీజ్‌లో పట్టుమని పది నిమిషాలు కూడా నిలవలేకపోయారు. ఈ విజయంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది.