IND vs SA Women’s U19 World Cup Final: సౌతాఫ్రికా ఆశలకు గండి కొట్టిన భారత్.. వరుసగా రెండో సారి వరల్డ్ కప్ దక్కించుకుని రికార్డు
IND vs SA Women’s U19 World Cup Final: దాదాపు రెండు వారాల పాటు ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ల తర్వాత, అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ 2025 ఛాంపియన్‌గా భారత్ నిలిచింది.
IND vs SA Women’s U19 World Cup Final: సౌతాఫ్రికా ఆశలకు గండి కొట్టిన భారత్.. వరుసగా రెండో సారి వరల్డ్ కప్ దక్కించుకుని రికార్డు
IND vs SA Women’s U19 World Cup Final: దాదాపు రెండు వారాల పాటు ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ల తర్వాత, అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ 2025 ఛాంపియన్‌గా భారత్ నిలిచింది. ఈసారి టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ భారతదేశం, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగింది. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లోని బేయుమాస్ ఓవల్ స్టేడియంలో రెండు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత జట్టు చాలా తేలికగా గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. భారత జట్టు వరుసగా రెండోసారి అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది. అంతకుముందు 2023 సంవత్సరంలో కూడా టీం ఇండియా ఛాంపియన్‌గా నిలిచింది.
ఈ టోర్నమెంట్‌లో నిక్కీ ప్రసాద్ కెప్టెన్సీలో టీం ఇండియా అద్బుత ప్రదర్శన చేసింది. ఈ టోర్నమెంట్‌లో భారత జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు.. టైటిల్ గెలుచుకుంది. రెండు జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. మొత్తం జట్టు 20 ఓవర్లలో 82 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా తరపున మీకే వాన్ వూర్స్ట్ అత్యధికంగా 23 పరుగులు చేశారు. వీరితో పాటు గెమ్మ బోథా 16 పరుగులు, ఫాయే కౌలింగ్ 15 పరుగులు చేశారు.
మరోవైపు, భారతదేశం తరపున త్రిష గొంగడి అత్యధిక వికెట్లు తీసింది. త్రిష 4 ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. వీరితో పాటు వైష్ణవి శర్మ, ఆయుషి శుక్లా, పరుణికా సిసోడియా కూడా తలా 2 వికెట్లు పడగొట్టారు. షబ్నమ్ షకీల్ కూడా ఒక బ్యాట్స్‌మన్ వికెట్ తీయడంలో విజయం సాధించింది.
చివరి మ్యాచ్‌లో టీం ఇండియా విజయానికి 83 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని భారత జట్టు చాలా సులభంగా ఛేదించింది. ఈ సమయంలో ఓపెనర్లు త్రిష, కమలిని జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు మొదటి వికెట్‌కు కేవలం 4.3 ఓవర్లలో 36 పరుగులు జోడించారు. దీని కారణంగా భారత జట్టు కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.. మ్యాచ్ గెలిచింది. గత సంవత్సరం కూడా పురుషుల T20 ప్రపంచ కప్ ఫైనల్లో భారతదేశం, దక్షిణాఫ్రికా జట్లు తలపడ్డాయి. అప్పుడు కూడా టీం ఇండియా గెలిచింది.
2025 U19 మహిళల T20 ప్రపంచ కప్‌లో టీం ఇండియా ఏకపక్షంగా ఆడింది. వారు దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో ఓడించడం ద్వారా ప్రారంభించారు. దీని తర్వాత భారత జట్టు మలేషియాను 10 వికెట్ల తేడాతో ఓడించి, ఆపై శ్రీలంకను 60 పరుగుల తేడాతో ఓడించింది. వారు బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో , స్కాట్లాండ్‌పై 150 పరుగుల తేడాతో గెలిచారు. ఆ తర్వాత వారు సెమీ-ఫైనల్లో ఇంగ్లాండ్‌ను 9 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్స్‌లో తమ స్థానాన్ని సంపాదించుకున్నారు. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి కప్ గెలిచారు. ఈ విజయంతో భారత అండర్-19 మహిళల జట్టు తమ అద్భుత ప్రతిభను ప్రపంచానికి చాటింది. త్రిష సహా మొత్తం జట్టు సభ్యుల ఆటతీరుకు క్రీడాభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.