IND vs ENG, 2nd T20I: భారత్, ఇంగ్లాండ్ రెండో T20 మ్యాచ్ కు వరుణ గండం.. చెన్నైలో వాతావరణ పరిస్థితి ఇది..!

IND vs ENG: భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతోంది. జనవరి 22న మొదటి టీ20 జరిగింది.

Update: 2025-01-25 05:29 GMT

IND vs ENG, 2nd T20I: భారత్, ఇంగ్లాండ్ రెండో T20 మ్యాచ్ కు వరుణ గండం.. చెన్నైలో వాతావరణ పరిస్థితి ఇది..!

IND vs ENG: భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతోంది. జనవరి 22న మొదటి టీ20 జరిగింది. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగింది. తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత జట్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జనవరి 25న అంటే నేడు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. దీనికోసం రెండు జట్లు చెన్నైలో తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

రెండో టీ20 మ్యాచ్‌లో విజయం సాధించి భారత జట్టు సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లి తన విజయ పరంపరను కొనసాగించాలని చూస్తుంది. ఇంగ్లాండ్ రెండవ T20 మ్యాచ్ గెలవడం ద్వారా సిరీస్‌లో తొలి విజయాన్ని సాధించాలని ప్రయత్నాలు చేస్తుంది. రెండవ T20 మ్యాచ్‌కు ముందు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

రెండో టీ20 మ్యాచ్ కు ముందు చెన్నై వాతావరణం గురించి వాతావరణ శాఖ క్రికెట్ ప్రియులకు శుభవార్త అందించింది. Accuweather.com ప్రకారం, మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశం లేదు. ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఉత్తర-ఈశాన్య దిశ నుండి గంటకు 17 నుండి 37 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. మేఘాలు ఉంటాయి, కానీ ఇది ఆటకు ఆటంకం కలిగించవు.

ఇండియా vs ఇంగ్లాండ్ T20 సిరీస్ జట్లు

భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్-కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు సామ్సన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్).

ఇంగ్లాండ్: జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్ (వైస్-కెప్టెన్), ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జాకబ్ బెథెల్, లియామ్ లివింగ్‌స్టోన్, రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, బ్రైడాన్ కార్స్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, మార్క్ వుడ్.

మొదటి మ్యాచ్ ఏమైంది?

తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు భారత బౌలర్లపై పూర్తిగా విఫలమైంది. ఇంగ్లాండ్‌ను భారత్ 132 పరుగులకే ఆలౌట్ చేసింది. దీనికి సమాధానంగా భారత్ కేవలం 13 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 79 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

Tags:    

Similar News