India VS England: కెప్టెన్సీపై రహానే కీలక వ్యాఖ్యలు

మరోవైపు రహానే కెప్టెన్సీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ గా ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు మరోలా బాడీ లాగ్వేజ్ ఉండదు.

Update: 2021-02-12 16:07 GMT

రహానే ఫైల్ ఫోటో 

భారత్ - ఇంగ్లాండ్ మధ్య జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా శనివారం నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. తొలి టెస్టు వేదికైనా చెన్నెై చిదంబరం స్టేడియంలోనే రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. తొలి టెస్టు విజయంలో ఇంగ్లాండ్ ఉత్సాహంతో కనిపిస్తుంటే. రెండో టెస్టులో విజయం సాధించి ఇంగ్లాండ్ కు షాక్ ఇవ్వాలని భారత్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది.

శనివారం మ్యాచ్ ముందు టీమిండియా క్రికెటర్ వైస్ కెప్టెన్ రహానే మీడియాతో మాట్లాడాడు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఘాటుగా జవాబు ఇచ్చాడు రహానే. రోహిత్ ఫామ్ గురించి మీడియా ఆడిగిన ప్రశ్నలకు.. రోహిత్‌ ఆసీస్‌లో చాలా బాగా ఆడాడు. కేవలం రెండు ఇన్నింగ్సుల్లో ఆడకపోతే చెడ్డ ఆటగాడు అవుతాడా? అతడు గతంలో మ్యాచులు గెలిపించాడు. అతడు కుదురుకుంటే మ్యాచులు గెలిపించగలడని మీకు తెలుసు. అంటూ రహానే ఆవేశంలో బదులిచ్చాడు.

తనఫామ్ గురించి కూడా రహానే మాట్లాడుతూ..గత సిరీసులో నా స్కోర్లను (59, 115) చూస్తే మీకే అర్థమవుతుంది. టీమ్‌ఇండియాకు నేనేం చేయాలన్న దానిపైనే నా దృష్టి ఉంటుంది. నా చివరి 10-15 టెస్టులు తీసుకుంటే 1000 పరుగులు చేశాను కనిపిస్తాయి. 

మరోవైపు రహానే కెప్టెన్సీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ గా ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు మరోలా బాడీ లాగ్వేజ్ ఉండదు. నేనింతకు ముందే చెప్పినట్టు మా జట్టు కెప్టెన్ విరాట్‌ కోహ్లీనే. ఎప్పటికీ అతడే ఉంటాడు. ఒకవేళ మీరు(మీడియా) వివాదం కోసం ఇలాంటి ప్రశ్నలడిగితే దురదృష్టవశాత్తు అది దొరకదు అంటూ బదులిచ్చాడు. జట్టులో మార్పులు గురించి మాట్లాడుతూ.. మ్యాచ్ ముందు నిర్ణయం తీసుకుంటామాని స్పష్టం చేశాడు.

Tags:    

Similar News