Ind vs Eng 5th Test: టీమిండియా-ఇంగ్లండ్ చివరి టెస్టు రద్దు

* సిరీస్ ఫలితంపై రెండు దేశాల బోర్డుల మధ్య దోబుచులాట * ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో కోహ్లీసేన

Update: 2021-09-10 09:26 GMT

టీమిండియా-ఇంగ్లండ్ చివరి టెస్టు రద్దు (ఫోటో: ఇన్సైడ్ స్పోర్ట్)

India vs England 5th Test: ఊహించిందే జ‌రిగింది. ఇండియా, ఇంగ్లండ్ మ‌ధ్య ఇవాళ ప్రారంభం కావాల్సిన చివ‌రి టెస్ట్‌ను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు రద్దు చేసింది. మ్యాచ్‌కు ఒక రోజు ముందు ఇండియ‌న్ టీమ్‌లోని సిబ్బంది ఒక‌రికి క‌రోనా సోకడంతో మ్యాచ్ జ‌ర‌గ‌డంపై ముందే అనుమానాలు వ్యక్తమ‌య్యాయి. చివ‌రికి బీసీసీఐతో చ‌ర్చించిన త‌ర్వాత మ్యాచ్‌ను ర‌ద్దు చేయాల‌ని నిర్ణయించిన‌ట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. టీమ్‌లో మ‌రిన్ని కొవిడ్ కేసులు వ‌స్తాయ‌న్న ఆందోళ‌న‌తో టీమ్‌ను బ‌రిలోకి దించ‌డానికి ఇండియ‌న్ టీమ్ సుముఖంగా లేదు అని ఈసీబీ తెలిపింది.

మరోవైపు మ్యాచ్ రద్దు ప్రకటన చేసే క్రమంలో హైడ్రామా నెలకొంది. మొదట వాయిదా అని ప్రకటించిన ఈసీబీ ఆ తర్వాత రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా కొవిడ్‌ నేపథ్యంలో భారత్‌ తన తుదిజట్టుని దింపలేకపోయిందని, భారత్ ఓటమి ఒప్పుకుందంటూ కామెంట్ చేసింది. ఈ ప్రకటనపై భారత్‌ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆ తర్వాత వెనక్కు తగ్గింది. అయితే, సిరీస్ ఫలితంపై మాత్రం రెండు దేశాల బోర్డుల మధ్య దోబుచులాట చోటుచేసుకుంది. ఇప్పటి వరకు 2-1 తేడాతో ఈసిరీస్‌లో కోహ్లీసేన ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే రద్దయిన మ్యాచ్‌ మళ్లీ నిర్వహించే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిరీస్‌ ఫలితంపై సందిగ్ధం నెలకొంది.

Tags:    

Similar News