India vs England: మెరిసిన ఇషాన్‌ కిషన్, ముగించిన కోహ్లి

India vs England:అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన రెండో టీ20లో భారత్ ప్రతీకారం తీర్చుకుంది.

Update: 2021-03-15 00:45 GMT

ఇషాన్ కిషన్ (ఇమేజ్ సోర్స్Cricbuzz )

India vs England: అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన రెండో టీ20లో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మొదటి టీ20లో ఘోర పరాజయం ముటగట్టుకున్న భారత్.. రెండో మ్యాచ్‌లో రాటుదేలింది. బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ రాణించి అదరగొట్టింది. అహ్మదాబాద్ వేదికగా జరుగిన రెండో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్‌పై ఏడు వికెట్ల తేడాతో టీంమిండియా అదరగొట్టింది. కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. కోహ్లీ 73 పరుగులు చేశాడు. రెండో టీ20 లో విజయం సాధించడంతో.. 5 మ్యాచ్‌లకు 1-1గా సమం చేశారు.. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది.. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 13 బంతులు మిగిలి ఉండగానే 166 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది.

భారత్‌ బౌలర్లు సుందర్, శార్దూల్‌లకు చెరో రెండు వికెట్లు పడగా.. భువనేశ్వర్, చాహల్ కు చెరో వికెట్ పడింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ రాయ్ 46, మోర్గాన్ 28, మలన్ 24, బెన్ స్టోక్స్ 24 పరుగులతో రాణించారు.. ఇండియా కోహ్లి 73, ఇషాంత్‌ కిషన్ 56, రిషబ్ పంత్ 26 పరుగులు చేశారు. కరణ్, జోర్దాన్, రషీద్‌లకు తలో ఒక వికెటు పడింది..

ఈ మ్యాచ్ లో ఆరంగేట్రం‌లోనే టీమిండియా బ్యాట్స్ మెన్ ఇషాన్‌ కిషన్‌ అదరగొట్టాడు. కెప్టెన్ విరాట్‌ కోహ్లితో కలిసి వేగంగా పరుగులు చేశాడు. వేగంగా ఆర్థసెంచరీ సాధించాడు. లక్ష్యఛేదనలో కోహ్లీ ధాటిగా ఆడడంతో భారత్ విజయం సునాయాసం అయింది. తొలి టి20లో ఎదురైన ఓటమిని మర్చిపోయేలా టీమిండియా మెరిసింది. రెండు జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్‌ రేపు ఇదే వేదికపై జరుగుతుంది.

Tags:    

Similar News