IND vs AUS: తొలి వ‌న్డేలో 5 వికెట్ల తేడాతో భార‌త్ విజ‌యం

IND vs AUS: 75 పరుగులతో అజేయంగా నిలిచిన లోకేశ్ రాహుల్

Update: 2023-03-18 01:45 GMT

IND vs AUS: తొలి వ‌న్డేలో 5 వికెట్ల తేడాతో భార‌త్ విజ‌యం

IND vs AUS: ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతోజరిగిన తొలివన్డేలో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టన్ హార్డిక్ పాండ్యా... ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. 35 ఓవర్ల నాలుగు బంతులకు 188 పరుగులు సాధించిన ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లు చేతులెత్తేశారు. మహ్మద్ షమీ, సిరాజ్‌కు చెరో మూడు వికెట్లు, రవీంద్ర జడేజాకు రెండు వికెట్లు, పాండ్యా, కుల్దీప్ యాదవ్‌ చెరో వికెట్ సాధించారు.

190 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. తొలి ఐదు ఓవర్లలోనే మూడు వికెట్లను కోల్పోయిన ఇండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ వెంటవెంటనే పెవీలియన్ బాట పట్టారు. శుభమన్ గిల్, లోకేశ్ రాహుల్ జోడీ స్కోరుబోర్డును పరుగులుపెట్టించింది.

శుభమన్ గిల్ ఔటైన తర్వాత బరిలోకి దిగిన హర్థిక్ పాండ్యా మెరుగైన ఆటతీరును ప్రదర్శించి పెవీలియన్ బాటపట్టాడు. ఆతర్వాత క్రీజులో కుదురుకున్న లోకేశ్ రాహుల్‌కు జోడీకట్టిన రవీంద్ర జడేజా స్కోరు బోర్డును పరుగులు పెట్టించి లక్ష్యాన్ని సునాయసనంగా చేధించారు. మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా విజయంతో బోణీ కొట్టింది. ఈనెల 19 తేదీన విశాఖలో రెండో వన్డే జరుగనుంది.

Tags:    

Similar News