India Hockey: ఒలింపిక్స్ పురుషుల హాకీలో కాంస్య పతకం సాధించిన భారత్

*పురుషుల హాకీ కాంస్య పోరుల్లో జర్మనీపై భారత్ విజయం *జర్మనీపై విరుచుకుపడిన భారత టీం *జర్మనీపై 5-4 ఆధిక్యంతో గెలిచిన భారత్

Update: 2021-08-05 04:46 GMT

భారత హాకీ జట్టు(ట్విట్టర్ ఫోటో)

India Hockey: నిమిషం నిమిషం ఉత్కంఠ.. ఆఖరి సెకండ్ వరకు నరాలు తెగేంత టెన్షన్.. కాంస్యమే గెలిచింది. కానీ, 130కోట్ల మంది హృదయాలను గెలుచుకున్నారు. మొదటి క్వార్టర్‌లో ప్రత్యర్థి గోల్ సాధించింది. అయినా మన జట్టు తగ్గలేదు రెండో క్వార్టర్ నుంచి పుంజుకుంది. సూపర్ ఓవర్‌ను తలపించేలా క్యాంస పతక హాకీ మ్యాచ్ జరిగింది. సెకన్లు గడిచే కొద్ది నరాలు తెగే ఉత్కంఠను కొనసాగించి ఆ మ్యాచ్ దాని ఫలితం 130 కోట్ల మంది భారతీయులు కలలను నిజం చేస్తూ అంఖండ విజయాన్ని అందుకుంది. టోక్యో నడిబొడ్డున చెక్ దే ఇండియా అంటూ మార్మోగాయి. ఒకప్పుడు భారత్‌తో హాకీ మ్యాచ్ అంటే ప్రత్యర్థి గుండెళ్లో రైళ్లు పరిగెత్తేవి. అయితే ఇవాళ జరిగిన మ్యాచ్‌ను చూస్తే భారత హాకీకి మళ్లీ ఆ పూర్వ వైభవం వచ్చిందా అనే విధంగా సాగింది. ఇప్పుడు వచ్చింది కాంస్యమే కావొచ్చు. కానీ, బంగారు పతకం కంటే ఏమాత్రం తీసిపోని విధంగా మన ఆటగాళ్లు ప్రత్యర్థికి ముచ్చెమటలు చూపించారు. పట్టపగలే హాకీ గ్రౌండ్ లో జర్మనీ ఆటగాళ్లు చుక్కలు చూశారు.

41 ఏళ్ల నిరీక్షణకు తెర పడింది. 1980 తర్వాత తొలిసారి ఒలింపిక్ లో పతకం సాధించింది. ఇన్నాళ్లకు విజయం వరించింది. ఎన్నాళ్లో ఎదురు చూసిన కలలను నిజం చేసింది టీమిండియా జపాన్‌లోని టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత్ టీం కాంస్య పతకాన్ని అందుకుంది. జర్మనీతో జరిగిన ఉత్కంఠ బరిమైన పోరులో భారత్ అరుదైన విజయం సాధించింది. తిరుగులేని విజయం అందుకుంది. చాలా రోజుల తర్వాత ఒలింపిక్స్‌లో పతకం గెలవడం పై అఖండ భారతవని మురిసింది. టోక్యోలో భారత కీర్తి రెపరెపలాడించింది. ఒలింపిక్స్‌లో పతకాల కరువు తీరుస్తూ మన్ ప్రీత్ సేన ఆవిష్కరించనున్నట్టు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

టోక్యోలో కాంస్య పతక పోరులో సాగిన మ్యాచ్‌లో భారత్ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. బలమైన ప్రత్యర్థిని 5-4 తో చిత్తు చేసింది. 130కోట్ల మంది భారతీయుల హృదయాలు పులకరించాయి. సరికొత్త ఆవిష్కృతమైంది. కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో నిమిషం నిమిషం ఉత్కంఠ సాగింది. చివరకు 5-4తో భారత్ విజయం అందుకుంది. భారత హాకీ టీంకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు..

నవ చరిత్రకు మన్ ప్రీత్ సేన నాంది పలికింది. మ్యాచ్ మొదటి క్వార్టర్‌లో జర్మనీ ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత మన్‌ప్రీత్ సేన పుంజుకుంది. రెండో క్వార్టర్‌లో చెలరేగింది. వరస గోల్స్‌తో జర్మనికి అవకాశం ఇవ్వకుండా గోల్స్ మీద గోల్స్ చేసింది. దాంతో రెండో క్వార్టర్‌ సిమ్రన్ జీత్ గోల్ తో భారత్ ఖాతా తెరిచింది. ఆతర్వాత సెకండ్ క్వర్టర్ ముగిసే సమయానికి 5-3తో భారత్ ఆధిక్యత ప్రదర్శించింది. హార్థిక్ సింగ్ రెండో గోల్, హర్మన్ ప్రీత్ మూడో గోల్ చేశారు. ఇక మూడో క్వర్టర్‌ వచ్చేసరికి జర్మనీ మరో గోల్ కొట్టి 4-5 గా నిలిచింది.

ఆ తర్వాత నాలుగో క్వార్టర్‌ లో భారత్ నిలకడగా ఆడారు. జర్మనీ ఆటగాళ్లను గోల్స్ చేయకుండా అడ్డుకోవడంతో.. భారత్‌ను విజయం వరించింది. దీంతో కాంస్య పతకం వరిచింది. ఒలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య 5కి చేరింది. 41 ఏళ్ల కలను నిజం చేయడంతో భారత్‌ హాకీ టీంపై ప్రశంసలు జల్లుకురిపిస్తున్నారు.

Tags:    

Similar News