రెండో టెస్టులో తడబడిన భారత్.. సెకండ్ ఇన్సింగ్స్‌లో 34 పరుగులకే 4 వికెట్లు

* 22 బంతులాడి ఒక్క పరుగే చేసిన కోహ్లి.. సెకండ్ ఇన్నింగ్స్‌లో 231 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌట్

Update: 2022-12-24 14:14 GMT

రెండో టెస్టులో తడబడిన భారత్.. సెకండ్ ఇన్సింగ్స్‌లో 34 పరుగులకే 4 వికెట్లు

India Vs Bangladesh: రెండో టెస్టులో భారత్ తడబడింది. స్వల్ప లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన టీమిండియా.. వరుసగా వికెట్లు కోల్పోయింది. 34 పరుగులకే నాలుగు కీలక వికెట్లు చేజార్చుకుంది. రన్ మిషన్ విరాట్ కోహ్లీ పరుగులు చేసేందుకు చాలా కష్టపడ్డాడు. 22 బంతులు ఆడి కేవలం ఒక్క పరుగు చేసి వెనుదిరిగాడు. పుజారా, శుభ్‌మన్‌ గిల్, రాహుల్ కూడా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

అంతకుముందు 7 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 231 పరుగుల వద్ద ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో స్కోరు తక్కువగా ఉండడంతో.. భారత్ ముందు 145 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. టీమిండియా విజయానికి మరో 100 పరుగులు కావాల్సి ఉంది. ఇంకా రెండ్రోజుల ఆట మిగిలి ఉంది.

Tags:    

Similar News