IND vs SL Asia Cup 2023 Final: ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్-శ్రీలంక తలపడనున్నాయి
IND vs SL Asia Cup 2023 Final: ఈ ప్రతిష్ఠాత్మకమైన పోరుకు కొలంబో పి. ప్రేమదాస స్టేడియం వేదిక కానుంది.
IND vs SL Asia Cup 2023 Final: ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్-శ్రీలంక తలపడనున్నాయి
IND vs SL Asia Cup 2023 Final: IND vs SL Asia Cup 2023 Final : 2023 ఆసియా కప్ ఫైనల్ ఆదివారం కొలంబో వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్, శ్రీలంక జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ క్రమంలో శ్రీలంక.. ఆసియా కప్ చరిత్రలో అత్యధికసార్లు (13) ఫైనల్‌కు చేరిన జట్టుగా రికార్డు కొట్టింది. లంక తర్వాత భారత్ 11 సార్లు ఫైనల్ చేరుకుంది. కానీ భారత్ ఖాతాలో 7 ఆసియా కప్ టైటిళ్లు ఉండగా.. లంక ఆరుసార్లు మాత్రమే ఛాంపియన్‌గా నిలిచింది.
ఆదివారం జరగబోయే తుదిపోరులో గెలిచి.. భారత్‌తో టైటిళ్ల రికార్డును సమం చేయాలని శ్రీలంక భావిస్తోంది. మరోవైపు బహుళ జట్ల టోర్నీల్లో గత ఐదేళ్లుగా ఒక్క టైటిల్ గెలవని భారత్.. ఈసారి ఛాంపియన్‌గా నిలవాలని తహతహలాడుతోంది. మరి టీమ్ఇండియాకు కీలకం కానున్న ప్లేయర్లెవరో చూసేద్దామా..!
టాపార్డర్.. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్.. ఈ టోర్నీలో భారత్‌కు మంచి శుభారంభాలు ఇచ్చారు. చివరి మ్యాచ్ మినహా.. వరుసగా మూడుసార్లు రోహిత్ అర్ధ శతకాలు బాదడం, అటు గిల్ బంగ్లాతో మ్యాచ్‌లో శతకంతో టచ్‌లోకి రావడం భారత్‌కు కలిసొచ్చే అంశాలు. ఇక స్టార్ బ్యాటర్ కోహ్లీ.. పాకిస్థాన్‌పై సూపర్ సెంచరీతో పాత విరాట్‌ను గుర్తు చేశాడు. గత మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకున్న విరాట్ ఫైనల్లో చెలరేగితే లంక బౌలర్లకు కష్టాలు తప్పవు.
మిడిలార్డర్.. చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చాడు కేఎల్ రాహుల్. ఈ టైమ్‌లో తన ఫామ్‌పై ఎన్నో సందేహాలున్న వేళ.. పాక్‌పై అద్భుత సెంచరీ నమోదు చేసి సత్తా చాటుకున్నాడు. మరోసారి అతడు బ్యాట్ ఝలిపిస్తే.. టీమ్ఇండియాకు భారీ స్కోర్ ఖాయం. ఇక మరో బ్యాటర్ ఇషాన్ కిషన్ ఈ టోర్నీలో నిలకడగానే రాణిస్తున్నాడు. ఇషాన్ కూడా మిడిలార్డర్లో మంచి పార్ట్నర్షిప్ ఇవ్వగలిగితే భారత్‌ను ఆపడం లంకకు అసాధ్యం.
బౌలింగ్ విభాగం.. వరుస రోజుల్లో పాకిస్థాన్, శ్రీలంక మ్యాచ్‌ల్లో ఏకంగా తొమ్మిది వికెట్లతో దుమ్ముదులిపాడు కుల్దీప్ యాదవ్. మరోవైపు ఏడాది తర్వాత జట్టులకి వచ్చిన జస్ప్రీత్ బుమ్రా కూడా తన లయను అందిపుచ్చుకున్నాడు. పెద్దగా వికెట్లు పడగొట్టకపోయినా.. పరుగులు కట్టడి చేయడంలో బుమ్రా సక్సెస్ అయ్యాడు. వీరిద్దరికీ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తోడైతే.. లంక శాసించడం పెద్ద విషయమేమీ కాదు.
కొలంబో వాతావరణం.. ఆసియా కప్ ప్రారంభమైనప్పటి నుంచి.. శ్రీలంకలో పలు మ్యాచ్‌లకు వర్షం ఆటంకం కలిగించింది. అయితే ఫైనల్ మ్యాచ్‌కు సైతం కొలంబోలో వర్షం కురిసే అవకాశాలు 90 శాతం ఉన్నాయని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. ఒకవేళ ఆదివారం మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తే.. రిజర్వ్ డే సోమవారం మ్యాచ్ కొనసాగుతుంది. ఇక సోమవారం కూడా మ్యాచ్ ఫలితం రాకపోతే ఇరుజట్లు సంయుక్త విజేతలుగా నిలుస్తాయి.