IND vs SA Test Series : 6 ఏళ్ల తర్వాత ఈడెన్ గార్డెన్స్‌లో టెస్ట్.. భారత్ vs సౌతాఫ్రికా రికార్డులివే
భారత్, సౌతాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు రంగం సిద్ధమైంది. రేపు నవంబర్ 14 నుంచి కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్ స్టేడియం తొలి టెస్ట్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.
IND vs SA Test Series : 6 ఏళ్ల తర్వాత ఈడెన్ గార్డెన్స్‌లో టెస్ట్.. భారత్ vs సౌతాఫ్రికా రికార్డులివే
IND vs SA Test Series : భారత్, సౌతాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు రంగం సిద్ధమైంది. రేపు నవంబర్ 14 నుంచి కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్ స్టేడియం తొలి టెస్ట్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మైదానంలో దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ టెస్ట్ క్రికెట్ జరగనుండటంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఈడెన్ గార్డెన్స్ ఎప్పుడూ భారత క్రికెట్‌కు గుండెకాయ వంటిది. మరి ఈ చారిత్రక మైదానంలో ఇరు జట్ల రికార్డులు ఎలా ఉన్నాయి? హెడ్-టు-హెడ్ గణాంకాల ప్రకారం ఎవరిది పైచేయి? వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో భారత్, సౌతాఫ్రికా ఇప్పటివరకు మూడుసార్లు టెస్ట్ మ్యాచ్‌లలో తలపడ్డాయి. ఈ మైదానంలో ఇరు జట్ల రికార్డు ఈ విధంగా ఉంది. మొదటి మ్యాచ్ (1996)లో ఈ మైదానంలో తొలిసారి తలపడినప్పుడు సౌతాఫ్రికా, భారత్‌ను 329 పరుగుల భారీ తేడాతో ఓడించింది. ఆ తర్వాత భారత్ అద్భుతంగా పుంజుకుంది. 2004లో జరిగిన రెండో టెస్ట్‌లో ఆఫ్రికాను 8 వికెట్ల తేడాతో ఓడించింది. 2010 ఫిబ్రవరిలో జరిగిన మూడో టెస్ట్‌లో భారత్ ఇన్నింగ్స్, 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొత్తం మూడు మ్యాచ్‌లలో, భారత్ 2 మ్యాచ్‌లు గెలవగా, సౌతాఫ్రికా ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. కాబట్టి ఈ మైదానంలో భారత్ కొంచెం మెరుగైన స్థానంలో ఉంది.
ఈడెన్ గార్డెన్స్ మైదానం టీమ్ ఇండియాకు ఎప్పుడూ ఒక లక్కీ గ్రౌండ్ గానే ఉంది. భారత్ ఈ మైదానంలో ఇప్పటివరకు 42 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 13 మ్యాచ్‌లలో విజయం సాధించగా, 9 మ్యాచ్‌లలో ఓడిపోయింది. 20 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. భారత్ ఇక్కడ తొలి టెస్ట్‌ను 1934లో ఇంగ్లాండ్‌తో ఆడగా, ఆఖరి టెస్ట్‌ను 2019లో బంగ్లాదేశ్‌తో డే-నైట్ మ్యాచ్ రూపంలో ఆడింది. భారత్‌కు చివరిసారిగా 2012లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి ఎదురైంది.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత్, సౌతాఫ్రికా మధ్య ఇప్పటివరకు జరిగిన మొత్తం మ్యాచ్‌ల గణాంకాలు చూస్తే, సౌతాఫ్రికా స్వల్ప ఆధిక్యంలో ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 44 టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 16 టెస్టుల్లో గెలుపొందగా, సౌతాఫ్రికా 18 టెస్టుల్లో విజయం సాధించింది. మిగిలిన 10 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.
భారత్ ప్లేయింగ్ XI(అంచనా): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.