IND vs NZ Final: ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌ను ఓడించడం ఖాయం.. ఎలా అంటే ?
IND vs NZ Final: ఛాంపియన్స్ ట్రోఫీ చివరి దశలో ఉంది. మార్చి 9న దుబాయ్‌లో భారత్, కివీస్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. 25 సంవత్సరాల తర్వాత ఈ టోర్నమెంట్ ఫైనల్‌లో రెండు జట్లు ఒకదానికొకటి తలపడనున్నాయి.
IND vs NZ Final: ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌ను ఓడించడం ఖాయం.. ఎలా అంటే ?
IND vs NZ Final: ఛాంపియన్స్ ట్రోఫీ చివరి దశలో ఉంది. మార్చి 9న దుబాయ్‌లో భారత్, కివీస్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. 25 సంవత్సరాల తర్వాత ఈ టోర్నమెంట్ ఫైనల్‌లో రెండు జట్లు ఒకదానికొకటి తలపడనున్నాయి. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీం ఇండియా ఇప్పటివరకు అద్భుతంగా రాణించింది. ఈ టోర్నమెంట్‌లో అది ఓ సారి న్యూజిలాండ్ జట్టును ఓడించింది. కానీ ఇప్పుడు 2000 ఫైనల్‌లో తన ఓటమికి ప్రతీకారం తీర్చుకుని మళ్ళీ ఈ టైటిల్‌ను గెలుచుకునే అవకాశం వచ్చింది. న్యూజిలాండ్ జట్టు తరచుగా భారత జట్టుకు ముప్పుగా మారింది. మరి ఈసారి భారత్ మంచి ఫామ్ లో ఉన్న న్యూజిలాండ్ జట్టును ఓడించగలదా లేదా చూద్దాం.
ఫైనల్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి గ్రూప్ దశలో లాగా స్పిన్నర్ల వల వేసి కివీస్ ను దెబ్బతీసే ప్రయత్నం చేయబోతున్నారు. టీం ఇండియాలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఫ్రంట్‌లైన్ స్పిన్నర్లుగా రాణిస్తారని భావిస్తున్నాడు. అక్షర్ పటేల్ , రవీంద్ర జడేజా స్పిన్ ఆల్ రౌండర్లుగా ఉండనే ఉన్నారు. ఈ నలుగురు బౌలర్లతో గ్రూప్ దశలో భారత్ కివీస్ జట్టును 205 పరుగులకే ఆలౌట్ చేసింది.ఆ మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు పడగొట్టడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. ఫైనల్‌లో కూడా తను రోహిత్ శర్మకు 'బ్రహ్మాస్త్రం'గా మారే అవకాశం ఉంది.
వరుణ్ చక్రవర్తి మ్యాజిక్ మళ్ళీ పనిచేస్తే భారత్ విజయం ఖాయం. సెమీ-ఫైనల్స్ లో ఆస్ట్రేలియాపై మహ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా వంటి ఫేస్ బౌలర్లు మంచి ఫామ్‌లో కనిపించారు. పవర్‌ప్లేలో ఇద్దరి బౌలింగ్ కీలకంగా మారనుంది. రోహిత్ శర్మ అయినా, విరాట్ కోహ్లీ అయినా, భారత జట్టులోని అందరు బ్యాట్స్‌మెన్ ఇప్పటివరకు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. కానీ టీం ఇండియా ఫీల్డింగ్ పై దృష్టి పెట్టాలి. ఈ టోర్నమెంట్‌లో భారత ఫీల్డర్లు చాలా క్యాచ్‌లు మిచ్ చేశారు. ఫైనల్‌లో ఒక పొరపాటు ట్రోఫీని దూరం చేసే అవకాశం ఉంది.
టీం ఇండియాకు మాదిరి న్యూజిలాండ్ జట్టుకు ఇద్దరు ఫ్రంట్‌లైన్ స్పిన్నర్లు, ఇద్దరు స్పిన్ ఆల్ రౌండర్లు ఉన్నారు. వారందరూ కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. పేస్ అటాక్‌లో, మాట్ హెన్రీ , విలియం ఓ'రూర్క్ భారత ఓపెనర్లను దెబ్బ తీయవచ్చు. బ్యాటింగ్ కూడా పటిష్టంగా ఉంది. టాప్ ఆర్డర్‌లో రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ మంచి ఫామ్‌లో ఉన్నారు. సెమీ-ఫైనల్స్‌లో బాగా ఆడారు. మిడిల్ ఆర్డర్‌లో డారిల్ మిచెల్, టామ్ లాథమ్ మంచి పార్టనర్ షిప్ నెలకొల్పే అవకాశం ఉంది.వీరు టీం ఇండియాకు తీవ్ర నష్టం కలిగించొచ్చు.
టీం ఇండియా ఫ్లేయింగ్ ఎలెవన్
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.
న్యూజిలాండ్ ప్లేయింగ్ ఎలెవన్
విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), విలియం ఓ'రూర్కే, మాట్ హెన్రీ, కైల్ జామిసన్.
భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో ఉపయోగించిన పిచ్‌లోనే ఫైనల్ మ్యాచ్ ఆడతారు. దాదాపు 2 వారాల తర్వాత ఈ పిచ్‌పై మళ్ళీ మ్యాచ్ జరగబోతోంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో స్కోర్లు తక్కువగా ఉన్నాయి. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 241 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని టీం ఇండియా 42.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి సులభంగా ఛేదించింది. ఈసారి కూడా పిచ్ పై బ్యాటింగ్ అంత సులభం కాదు.
మ్యాచ్‌ను ఎప్పుడు, ఎక్కడ చూడాలి?
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చివరి మ్యాచ్ మార్చి 9న దుబాయ్‌లో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ 2 గంటలకు జరుగుతుంది. ఆట మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.
బహుమతి డబ్బు ఎంత?
ఏ జట్టు ఈ ఛాంపియన్స్ ట్రోఫీని గెలిస్తే, దానికి 2.24 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 19.5 కోట్ల రూపాయలు బహుమతిగా లభిస్తుంది. ఫైనల్‌లో ఓడిన జట్టుకు $1.12 మిలియన్లు అంటే దాదాపు రూ.9.78 కోట్లు ఇస్తారు.