IND vs AUS: రోహిత్, గిల్ ఇన్.. ఆ ఇద్దరు ఔట్! రెండో టెస్టుకు భారత్ తుది జట్టు ఇదే..

IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

Update: 2024-12-05 09:54 GMT

IND vs AUS: రోహిత్, గిల్ ఇన్.. ఆ ఇద్దరు ఔట్! రెండో టెస్టుకు భారత్ తుది జట్టు ఇదే..

IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆసీస్ గడ్డపై గెలుపుతో ఉత్సాహంగా ఉన్న టీమిండియా.. మరో పోరుకు సిద్ధమైంది. అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు ఆరంభం కానుంది. పింక్ బాల్‌తో జరగనున్న డే/నైట్ టెస్టు భారత కాలమాన ప్రకారం ఉదయం 9.30కుప్రారంభం అవుతుంది. ఈ టెస్టుకు ఎలాంటి వర్ష సూచన లేదు. అయితే రెండో టెస్టులో భారత్ తుది జట్టులో రెండు మార్పులు తప్పనిసరి కానున్నాయి.

కుమారుడు పుట్టిన కారణంగా తొలి టెస్టుకు దూరంగా ఉన్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. రెండో టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు. గాయంతో దూరమైన శుభ్‌మన్ గిల్ రెండో టెస్టుకు సిద్దమయ్యాడు. దాంతో విన్నింగ్ కాంబినేషన్‌ను తప్పక మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. డే/నైట్ టెస్టులో రోహిత్ ఓపెనర్‌గానే బరిలోకి దిగనున్నాడు. యశస్వీ జైస్వాల్‌తో కలిసి మొదటి టెస్టులో ఓపెనింగ్ చేసిన కేఎల్ రాహుల్.. రెండో మ్యాచులో ఆరో స్థానంలో రానున్నాడు. రోహిత్, గిల్ జట్టులోకి రావడంతో దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ తుది జట్టులో చోటు కోల్పోనున్నారు. విరాట్ కోహ్లీ 4, రిషబ్ పంత్ 5లో బ్యాటింగ్ చేస్తారు.

తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి కొనసాగనున్నాడు. మొదటి టెస్టులో ధాటిగా బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే. అలానే మీడియం పేస్ బౌలింగ్ కూడా వేశాడు. ఏకైన స్పిన్నర్‌గా వాషింగ్టన్ సుందర్ ఆడుతాడు. మరోసారి సీనియర్లు అశ్విన్, జడేజాలకు నిరాశ తప్పదు. పేస్ కోటాలో మహహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా ఆడుతారు. బుమ్రా మొదటి టెస్టులో చెలరేగిన విషయం తెలిసిందే. హర్షిత్ కూడా బుల్లెట్ బంతులతో ఆకట్టుకున్నాడు.

భారత్ తుది జట్టు (అంచనా):

యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (కీపర్), కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, మహహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్).

భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, అభిమన్యు ఈశ్వరన్, నితీశ్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా, దేవదత్ పడిక్కల్.

Tags:    

Similar News