ICC ODI Rankings: 143 మంది బౌలర్లను ఓడించిన వరుణ్ చక్రవర్తి

ICC ODI Rankings: వరుణ్ చక్రవర్తి ఆర్కిటెక్చర్ చదివాడు. తన చదువుకు తగ్గట్లే రోజు రోజుకు తను క్రికెట్ మైదానంలో విజయ శిఖరాన్ని నిర్మిస్తున్నాడు.

Update: 2025-03-05 11:00 GMT

ICC ODI Rankings: వరుణ్ చక్రవర్తి ఆర్కిటెక్చర్ చదివాడు. తన చదువుకు తగ్గట్లే రోజు రోజుకు తను క్రికెట్ మైదానంలో విజయ శిఖరాన్ని నిర్మిస్తున్నాడు. ఐసిసి కూడా అతడి సామర్థ్యాన్ని గుర్తించింది. ఐసీసీ తాజా వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోని 143 మంది బౌలర్లను అధిగమించి భారత స్పిన్నర్ సంచలనం సృష్టించాడు. ఈ కుడిచేతి వాటం స్పిన్నర్ ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడుతున్నాడు.. అక్కడ తనకు లభించిన రెండు ఛాన్సులలో చాలా వికెట్లు తీశాడు.

2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్‌ల్లో వరుణ్ చక్రవర్తి 7 వికెట్లు పడగొట్టాడు. ఈ 7 వికెట్లలో 5 వికెట్లు ఒకే మ్యాచ్‌లోనే తీశాడు. దీనితో అతను టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కూడా చేరాడు. ఇప్పుడు న్యూజిలాండ్‌కు చెందిన మాట్ హెన్రీ, మహమ్మద్ షమీ మాత్రమే అతని కంటే ఎక్కువ వికెట్లు తీశారు.

ఐసిసి వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 143 స్థానాలు ఎగబాకి వరుణ్ చక్రవర్తి టాప్ 100లోకి ప్రవేశించాడు. వరుణ్ చక్రవర్తి ఇప్పుడు 97వ స్థానానికి చేరుకున్నాడు. ఐసిసి వన్డే బౌలర్లలో అగ్రస్థానంలో శ్రీలంకకు చెందిన మహీష్ తీక్షణ 680 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన కేశవ్ మహారాజ్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని ఇప్పుడు రెండవ స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్‌కు చెందిన మాట్ హెన్రీ మూడు స్థానాలు ఎగబాకి మూడవ స్థానానికి చేరుకున్నాడు.

ఐసీసీ వన్డే బౌలర్ల టాప్ 10 జాబితాలో భారత్ నుంచి కుల్దీప్ యాదవ్ ఒక్కడే ఉన్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో కుల్దీప్ మూడు స్థానాలు దిగజారి ఆరో స్థానానికి చేరుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో తన ప్రదర్శనకు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి మంచి గుర్తింపు వచ్చింది. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో అతను మూడు స్థానాలు ఎగబాకి 11వ స్థానానికి చేరుకున్నాడు. రవీంద్ర జడేజా 13వ స్థానంలో కొనసాగుతున్నాడు. మహ్మద్ సిరాజ్ రెండు స్థానాలు దిగజారి 14వ స్థానానికి చేరుకున్నాడు.

Tags:    

Similar News