Team India: రాత్రికి రాత్రే మారిన టీమిండియా లక్.. చరిత్రకు ఒక్కడుగు దూరంలో.. ఓటమితో పాకిస్థాన్‌కు భారీ దెబ్బ..!

ICC ODI Ranking: కొలంబోలోని ఆర్‌ ప్రేమదాస స్టేడియంలో జరిగిన సూపర్‌-4 రౌండ్‌ మ్యాచ్‌లో చివరి బంతికి పాకిస్థాన్‌ను ఓడించి శ్రీలంక ఫైనల్‌కు చేరుకుంది. ఈ ఓటమితో పాకిస్థాన్ జట్టు ఆసియాకప్ నుంచి నిష్క్రమించింది.

Update: 2023-09-15 05:13 GMT

Team India: రాత్రికి రాత్రే మారిన టీమిండియా లక్.. చరిత్రకు ఒక్కడుగు దూరంలో.. ఓటమితో పాకిస్థాన్‌కు భారీ దెబ్బ..!

Latest ICC ODI Ranking: కొలంబోలోని ఆర్‌ ప్రేమదాస స్టేడియంలో జరిగిన సూపర్‌-4 రౌండ్‌ మ్యాచ్‌లో చివరి బంతికి పాకిస్థాన్‌ను ఓడించి శ్రీలంక ఫైనల్‌కు చేరుకుంది. ఈ ఓటమితో పాకిస్థాన్ జట్టు ఆసియాకప్ నుంచి నిష్క్రమించింది. ఈ ఓటమితో పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వన్డే ర్యాంకింగ్స్‌లో ఆ జట్టు స్థానం దిగజారింది. అదే సమయంలో, పాకిస్తాన్ ఓటమి కారణంగా ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్‌లో టీమిండియాకు భారీ ప్రయోజనం లభించింది.

రాత్రికి రాత్రే మారిపోయిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్..

శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు వన్డే ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియాతో పాటు పాకిస్థాన్ జట్టు నంబర్ వన్ స్థానంలో ఉంది. కానీ, శ్రీలంక చేతిలో ఓడిపోవడంతో వన్డే ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి పడిపోయింది. పాక్‌ ఓటమితో టీమ్‌ ఇండియా లాభపడింది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత క్రికెట్ జట్టు ఇప్పుడు ఒక స్థానం ఎగబాకి రెండో స్థానానికి చేరుకుంది.

ఆస్ట్రేలియా మొదటి స్థానంలో..

ఆస్ట్రేలియా జట్టు నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ఖాతాలో 3061 పాయింట్లు, 118 రేటింగ్‌ పాయింట్స్ ఉన్నాయి. అదే సమయంలో టీమిండియా రెండో స్థానంలో ఉంది. టీమిండియా 4516 పాయింట్లు, 116 రేటింగ్‌తో ఉంది. కానీ, పాకిస్థాన్ జట్టు ఇప్పుడు 3102 పాయింట్లతో 3 పాయింట్ల నష్టంతో రేటింగ్‌లో 115కి చేరుకుంది. దీంతో పాటు ఇంగ్లండ్ జట్టు నాలుగో స్థానంలో, న్యూజిలాండ్ జట్టు ఐదో స్థానంలో నిలిచాయి.

టీమిండియా నంబర్-1గా నిలిచే అవకాశం..

రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు నంబర్-1గా నిలిచే అవకాశం ఉంది. ఇది చేయాలంటే భారత జట్టు ఆసియా కప్ టైటిల్ గెలవాలి. దీంతో పాటు దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ ఫలితంపై కూడా టీమిండియా ఆధారపడాల్సి ఉంటుంది. ఇప్పుడు భారత అభిమానులు తమ మిగిలిన రెండు వన్డే మ్యాచ్‌లలో ఆస్ట్రేలియాను దక్షిణాఫ్రికా ఓడించాలి. ఇదే జరిగితే వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా నంబర్‌-1గా మారే అవకాశం ఉంది.

Tags:    

Similar News