World Cup 2027 : 3 దేశాలు.. 54 మ్యాచులు.. 2027 వన్డే వరల్డ్ కప్ స్టేడియాలు ఖరారు!
2027లో జరగబోయే ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ కోసం సన్నాహాలు వేగవంతం అయ్యాయి. ఈ టోర్నమెంట్‌ను సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా నిర్వహించనున్నాయి.
World Cup 2027 : 3 దేశాలు.. 54 మ్యాచులు.. 2027 వన్డే వరల్డ్ కప్ స్టేడియాలు ఖరారు!
World Cup 2027 : 2027లో జరగబోయే ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ కోసం సన్నాహాలు వేగవంతం అయ్యాయి. ఈ టోర్నమెంట్‌ను సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ మెగా ఈవెంట్ కోసం ఎంచుకున్న స్టేడియాలను క్రికెట్ సౌత్ ఆఫ్రికా (CSA) ప్రకటించింది. మొత్తం 54 మ్యాచ్‌లకు ఈ స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే కలిసి వరల్డ్ కప్‌ను నిర్వహించడం ఇది రెండోసారి. నమీబియాకు మాత్రం ఇది మొదటిసారి.
ఈ వరల్డ్ కప్‌లో సౌత్ ఆఫ్రికా 44 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. మిగిలిన 10 మ్యాచ్‌లు జింబాబ్వే, నమీబియాలో జరుగుతాయి. సౌత్ ఆఫ్రికాలో ఎంపిక చేసిన ఎనిమిది స్టేడియాలలో జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియం, కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్, డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ క్రికెట్ గ్రౌండ్, ప్రిటోరియాలోని సెంచూరియన్ పార్క్, బ్లోమ్‌ఫోంటెన్‌లోని మంగౌంగ్ ఓవల్, గకేబర్హాలోని సెయింట్ జార్జ్ పార్క్, ఈస్ట్ లండన్‌లోని బఫెలో పార్క్, పార్ల్‌లోని బోలాండ్ పార్క్ ఉన్నాయి. ఈ స్టేడియాలన్నీ తమ అద్భుతమైన సౌకర్యాలు, చారిత్రక ప్రాముఖ్యతకు పేరుగాంచాయి.
సౌత్ ఆఫ్రికా మాజీ ఆర్థిక మంత్రి ట్రెవర్ మాన్యువల్ స్థానిక నిర్వహణ కమిటీ హెడ్‌గా వ్యవహరించనున్నారు. సౌత్ ఆఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్, ప్రిటోరియా, కేప్‌టౌన్, డర్బన్, గకేబర్హా, బ్లోమ్‌ఫోంటెన్, ఈస్ట్ లండన్, పార్ల్‌లలో మ్యాచ్‌లు జరుగుతాయని సిఎస్‌ఏ ఒక ప్రకటనలో తెలిపింది.
వరల్డ్ కప్ ఫార్మాట్ ఎలా ఉంటుంది?
2027 వరల్డ్ కప్‌లో మొత్తం 14 జట్లు పాల్గొంటాయి. దీని ఫార్మాట్ 2003 వరల్డ్ కప్ మాదిరిగానే ఉంటుంది. ఈ టోర్నమెంట్‌లో రెండు గ్రూప్‌లు ఉంటాయి. ప్రతి గ్రూప్‌లో ఏడు జట్లు ఉంటాయి. చివరిసారిగా 2003లో సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, కెన్యాతో కలిసి ఈ టోర్నమెంట్‌ను నిర్వహించింది. అప్పుడు ఆస్ట్రేలియా జట్టు టైటిల్ గెలుచుకుంది.