WTC Final: ప్రైజ్‌మనీని ప్రకటించిన ఐసీసీ
WTC Final: ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ విన్నర్‌కి ఇచ్చే ప్రైజ్‌మనీని ఐసీసీ సోమవారం ప్రకటించింది.
భారత్, న్యూజిలాండ్ జట్లు (ఫొటో ట్విట్టర్)
WTC Final: ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ విన్నర్‌కి ఇచ్చే ప్రైజ్‌మనీని ఐసీసీ సోమవారం ప్రకటించింది. ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్ జూన్ 18 నుంచి 22 వరకూ జరగనుండగా.. ఇప్పటికే అక్కడికి చేరుకున్న రెండు జట్లు తుది పోరు కోసం సిద్ధమవుతున్నాయి.
ఈ నెల 3న సౌథాంప్టన్‌కి చేరుకున్న భారత క్రికెటర్లు.. ఒక ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడేశారు. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ మెరుపు శతకం బాదేయగా.. ఓపెనర్ శుభమన్ గిల్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చారు.
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ విజేతకి ప్రైజ్‌మనీ రూపంలో రూ. 11.72 కోట్లని ఐసీసీ అందజేయనుంది. అలానే రన్నరప్‌గా నిలిచిన జట్టుకి రూ. రూ.5.85 కోట్లు ఇవ్వనుంది. ఒకవేళ మ్యాచ్ డ్రాగా ముగిస్తే..? ప్రైజ్‌మనీని ఇరు జట్లు సమానంగా పంచుకోనున్నాయి.