Shikhar Dhawan: గౌరవం దక్కినందుకు సంతోషంగా ఉంది: శిఖర్ ధావన్

Shikhar Dhawan: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియాను నడిపించే అవకాశం దక్కడం ఎంతో గౌరవమని ఓపెనర్ శిఖర్ ధావన్ అన్నాడు.

Update: 2021-06-11 15:15 GMT

శిఖర్ ధావన్ (ఫొటో ట్విట్టర్)

Shikhar Dhawan: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియాను నడిపించే అవకాశం దక్కడం ఎంతో గౌరవమని ఓపెనర్ శిఖర్ ధావన్ అన్నాడు. ఈ మేరకు శుక్రవారం ట్విట్టర్లో తను ఓ ట్వీట్ చేశాడు. శ్రీలంకలో పర్యటించే టీమిండియాకు బీసీసీఐ శిఖర్ ను కెప్టెన్‌ గా నియమించిన సంగతి తెలిసిందే.

'నా దేశాన్ని నడిపించే అవకాశం దక్కినందుకు గౌరవంగా ఉంది. మీ అందరి అభినందనలకు ధన్యవాదాలు' అని ట్విట్టర్లో రాసుకొచ్చాడు శిఖర్ ధావన్. అలాగే రాహుల్ ద్రవిడ్ టీం ఇండియకు కోచ్‌ గా వెళ్లనున్న సంగతి తెలిసిందే. ధావన్‌ ఇప్పటి వరకు 34 టెస్టులు, 145 వన్డేలు, 65 టీ20లు ఆడాడు. అప్పుడప్పుడు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన శిఖర్.. తొలిసారి టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

గురువారం రాత్రి శ్రీలంకలో పర్యటించే జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో శ్రీలంకతో 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ జులై 13 నుంచి కొలంబో వేదికగా జరగనున్నాయి. భువనేశ్వర్‌ కుమార్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

కాగా, టీం ఇండియాలోకి తొలిసారి 5గురు కొత్త ఆటగాళ్లకు పిలుపొచ్చింది. కృష్ణప్ప గౌతమ్‌, దేవదత్‌ పడిక్కల్‌, నితీశ్‌ రాణా, రుతురాజ్‌ గైక్వాడ్‌, చేతన్‌ సకారియా తొలిసారి టీం ఇండియాకు సెలక్ట్ అయ్యారు. వీరంతా దేశవాళీ క్రికెట్లోనే కాకుండా ఐపీఎల్‌లో సత్తా చాటారు. కాగా వీరందరూ అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి.


Tags:    

Similar News