U19 World Cup : 51 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు.. U19 ప్రపంచ కప్‌లో చరిత్ర సృష్టించిన ముగ్గురు అన్నదమ్ములు
వచ్చే ఏడాది నమీబియా, జింబాబ్వే దేశాలు వేదికగా అండర్-19 ప్రపంచ కప్ జరగనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలు తమ జట్లను ప్రకటించాయి.
U19 World Cup : 51 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు.. U19 ప్రపంచ కప్‌లో చరిత్ర సృష్టించిన ముగ్గురు అన్నదమ్ములు
U19 World Cup : వచ్చే ఏడాది నమీబియా, జింబాబ్వే దేశాలు వేదికగా అండర్-19 ప్రపంచ కప్ జరగనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలు తమ జట్లను ప్రకటించాయి. ఈ క్రమంలో జపాన్ U19 ప్రపంచ కప్ జట్టు ఎంపిక తర్వాత క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన రికార్డు నమోదైంది. జపాన్ ప్రపంచ కప్ జట్టులో ఏకంగా ముగ్గురు అన్నదమ్ములు స్థానం దక్కించుకున్నారు. అంటే ఆ ముగ్గురు సోదరులు ఒకే జట్టు తరఫున అండర్-19 ప్రపంచ కప్‌లో ఆడనున్నారు.
క్రికెట్ చరిత్రలో ఒకే జట్టులో ముగ్గురు సోదరులు ప్రపంచ కప్‌లో ఆడటం ఇది రెండోసారి మాత్రమే. అండర్-19 ప్రపంచ కప్ చరిత్రలో ఇలా జరగడం మాత్రం మొదటిసారి. అంతకుముందు 51 ఏళ్ల క్రితం 1975 వన్డే ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ జట్టులో ముగ్గురు సోదరులు స్థానం దక్కించుకున్నారు. అప్పుడు రిచర్డ్ హ్యాడ్లీ, బారీ హ్యాడ్లీ, డెల్ హ్యాడ్లీ అనే ముగ్గురు అన్నదమ్ములు న్యూజిలాండ్ తరఫున ప్రపంచ కప్‌లో ఆడారు. ఇప్పుడు 51 ఏళ్ల తర్వాత 2026లో సీనియర్ స్థాయిలో కాకపోయినా, అండర్-19 స్థాయిలో జపాన్ జట్టులో ముగ్గురు అన్నదమ్ములు కనిపించనున్నారు.
2026 U19 ప్రపంచ కప్ కోసం జపాన్ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో ఈ ముగ్గురు సోదరులకు చోటు దక్కింది. వారి పేర్లు..మాంట్‌గోమెరీ హారా హేంజ్, గాబ్రియేల్ హారా హేంజ్, చార్లెస్ హారా హేంజ్. వీరిలో చార్లెస్ పెద్దవాడు. ఈ ముగ్గురూ తమ దేశం తరఫున ఒకేసారి ప్రపంచ కప్ ఆడి చరిత్ర సృష్టించనున్నారు.
జపాన్ టీమ్ గ్రూప్ వివరాలు
అండర్-19 ప్రపంచ కప్ 2026లో జపాన్ జట్టును గ్రూప్ ఎలో ఉంచారు. ఈ గ్రూప్‌లో జపాన్‌తో పాటు ఆస్ట్రేలియా, శ్రీలంక, ఐర్లాండ్ వంటి జట్లు ఉన్నాయి. జపాన్ జట్టు జనవరి 5న ఆఫ్రికాకు బయలుదేరి వెళ్తుంది. అక్కడ జనవరి 10న టాంజానియాతో, జనవరి 12న వెస్టిండీస్‌తో వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది.