Highest Paid Captain: ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకునే కెప్టెన్లు వీరే.. విరాట్ కోహ్లీ ఎన్నో స్థానంలో ఉన్నాడో తెలుసా?

Highest Paid Captain: అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే కెప్టెన్ల విషయానికి వస్తే.. టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు అభిమానుల మదిలో మెదులుతుంది.

Update: 2021-12-27 15:00 GMT

Highest Paid Captain: ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకునే కెప్టెన్లు వీరే.. విరాట్ కోహ్లీ ఎన్నో స్థానంలో ఉన్నాడో తెలుసా?

Highest Paid Captain: అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే కెప్టెన్ల విషయానికి వస్తే.. టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు అభిమానుల మదిలో మెదులుతుంది. కానీ, భారత సారథి మాత్రం అగ్రస్థానంలో లేడంటే మాత్రం ఫ్యాన్స్ షాక్ అవ్వాల్సిందే. విరాట్ కోహ్లి కంటే ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ ఎక్కువ జీతం తీసుకుంటున్నాడని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ జాబితాను ఓసారి పరిశీలిస్తే..

టెస్టు ఫార్మాట్‌లో శ్రీలంక జట్టుకు దిముత్ కరుణరత్నే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అతనికి ఏటా రూ.51.03 లక్షలు జీతం రూపంలో అందుతున్నాయి. అదే సమయంలో పరిమిత ఓవర్లలో శ్రీలంక జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన కుశాల్ పెరీరా వార్షిక వేతనం రూ.25 లక్షలుగా ఉంది.

ప్రస్తుత కాలంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఒకరనడంలో సందేహం లేదు. బాబర్ కెప్టెన్సీలో పాకిస్థాన్ జట్టు టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరుకుంది. జీతం గురించి మాట్లాడితే, బాబర్ ఆజం ప్రతి సంవత్సరం రూ. 62.40 లక్షల జీతం తీసుకుంటున్నాడు.

వెస్టిండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ కీరన్ పొలార్డ్ కాగా, క్రెయిగ్ బ్రాత్‌వైట్ టెస్టు జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. పొలార్డ్ ఏటా రూ.1.73 కోట్లు వేతనంగా పొందుతున్నాడు. అలాగే టెస్ట్ సారథి బ్రాత్‌వైట్‌ మాత్రం రూ. 1.39 కోట్లు వేతనంగా అందుకుంటున్నాడు.

కేన్ విలియమ్సన్ చాలా కాలంగా న్యూజిలాండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అతని నాయకత్వంలో న్యూజిలాండ్ జట్టు టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరుకుంది. కానీ, ఫైనల్‌లో మాత్రం ఆస్ట్రేలియాపై ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే న్యూజిలాండ్ జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీని కూడా కైవసం చేసుకుంది. విలియమ్సన్ వార్షిక వేతనం రూ.1.77 కోట్లుగా ఉంది.

టెస్టు ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికాకు డీన్ ఎల్గర్ కెప్టెన్‌గా ఉండగా, పరిమిత ఓవర్లలో టెంబా బావుమాకు ఈ బాధ్యతలు మోస్తున్నారు. ఎల్గర్ వార్షిక వేతనం రూ.3.2 కోట్లు కాగా, బావుమాకు రూ.2.5 కోట్లు అందుకుంటున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే కెప్టెన్లలో ఆస్ట్రేలియా కెప్టెన్ ఒకరు. పరిమిత ఓవర్లలో ఆస్ట్రేలియా జట్టుకు ఫించ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఫించ్ క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి ప్రతీ సంవత్సరం 1 మిలియన్ డాలర్ల జీతం అంటే దాదాపు రూ. 7 కోట్లు పొందుతున్నాడు.

ఇక ఈ లిస్టులో రెండో స్థానంలో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలిచాడు. బీసీసీఐ నుంచి ప్రతి ఏడాది రూ.7 కోట్ల వేతనం పొందుతున్నాడు. బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్‌లో కోహ్లీ ఏ+ కేటగిరీలో ఉన్న సంగతి తెలిసిందే.

పరిమిత ఓవర్లలో ఇయాన్ మోర్గాన్ ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. టెస్టు జట్టుకు జో రూట్‌ నేతృత్వం వహిస్తున్నాడు. ఈ ఇద్దరు కెప్టెన్లకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు భారీ మొత్తం ఇస్తుంది. రూట్ వార్షిక వేతనం రూ.8.97 కోట్లు కాగా, మోర్గాన్ రూ.1.75 కోట్లు పొందుతున్నాడు.

Tags:    

Similar News