IPL 2023: సెంచరీల మోత, 200 ప్లస్ స్కోర్లు, ఐపీఎల్ 2023లో రికార్డుల మోత..

ఐపీఎల్ 2023 రికార్డ్స్. ఐపీఎల్ 2023 అంగరంగ వైభవంగా ముగిసింది. తుది పోరులో గుజరాత్ టైటాన్స్ ను ఓడించి ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది. ఇక రికార్డుల విషయానికొస్తే

Update: 2023-05-30 06:52 GMT

IPL 2023: సెంచరీల మోత, 200 ప్లస్ స్కోర్లు, ఐపీఎల్ 2023లో రికార్డుల మోత..

IPL2023 అంగరంగ వైభవంగా ముగిసింది. తుది పోరులో గుజరాత్ టైటాన్స్ ను ఓడించి ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన తుది సమరంలో సీఎస్కే 5

వికెట్ల తేడాతో జీటీపై గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 214 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు సీఎస్కే బరిలోకి దిగింది. అయితే వర్షం కారణంగా చెన్నై

సూపర్ కింగ్స్ లక్ష్యాన్ని 15 ఓవర్లకి 171 పరుగులు నిర్దేశించారు.

చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(47), దేవన్ కాన్వే(47) దూకుడుగా ఆడి శుభారంభాన్ని ఇచ్చారు. అజింక్య రహానె(27), అంబటి రాయుడు(19) సైతం హిట్టింగ్ తో అదరగొట్టారు. 13వ ఓవర్లో బరిలోకి దిగిన కెప్టెన్

ధోనీ గోల్డెన్ డక్ గా వెనుదిరగడంతో మ్యాచ్ ఉత్కంఠంగా మారింది. కానీ చివరిలో రవీంద్ర జడేజా చివరి రెండు బంతుల్లో వరుసగా సిక్స్ , ఫోరు కొట్టి చెన్నైకి మరపురాని విజయాన్ని అందించాడు. అంతకుముందు

బ్యాటింగ్ చేసిన జీటీ టీమ్ లో సాయి సుదర్శన్ 96 పరుగులుతో ఇరగదీశాడు. సాహా సైతం 54 పరుగులతో రాణించాడు. శుభమన్ గిల్ 39 పరుగులు చేశాడు.

మొత్తంగా, తుది పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ మరోసారి గెలిచి కప్ నిలబెట్టుకోవాలనుకుంది. కానీ నెరవేరలేదు. ఈ ఫైనల్ పోరులో విజయం సాధించి ఐపీఎల్ లో 5సార్లు విజయం సాధించిన జట్టుగా సీఎస్కే అరుదైన

ఘనత దక్కించుకుంది. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ మాత్రమే 5సార్లు టైటిల్ గెలిచింది.

మొత్తం 12 సెంచరీలు:

ఈ 2023 ఐపీఎల్ సీజన్ ఆది నుంచి రసవత్తరంగా సాగింది. అత్యధిక సెంచరీలు నమోదు అయ్యాయి. సీజన్ మొత్తంలో 12 సెంచరీలు నమోదు అయ్యాయి.

కోహ్లీ రికార్డు:

ఐపీఎల్ చరిత్రలోనే 7 సెంచరీలు చేసిన బ్యాట్స్ మెన్ గా కోహ్లీ రికార్డు క్రియేట్ చేశాడు.

పరుగుల వరద:

ఈ ఐపీఎల్ లో పరుగుల వరద పారింది. 200 పైగా స్కోరు నమోదైన మ్యాచులు 37 ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధికం.

ఛేజింగ్ :

ఛేజింగ్ పరంగా కూడా ఈ ఐపీఎల్ క్రికెట్ అభిమానులకు కనువిందు చేసింది. 200 పరుగులు పైగా స్కోర్ ని ఛేజ్ చేస్తూ ప్రత్యర్థి టీములు విజయం సాధించాయి. అలాంటి మ్యాచులు మొత్తం ఈ సీజన్ లో 8 ఉన్నాయి.

అత్యధిక రన్ రేట్ :

అత్యధిక రన్ రేట్ సైతం ఇదే సీజన్ లో నమోదు అయింది. 2022లో 8.54 రన్ రేట్ ఉంటే దాన్ని అధిగమిస్తూ ఈసారి 8.99 పరుగుల రన్ రేట్ నమోదు అయింది.

అత్యధిక హాఫ్ సెంచరీలు:

ఈ 2023 ఐపీఎల్ సీజన్ లో మొత్తం 153 హాఫ్ సెంచరీలు నమోదు అయ్యాయి.

Tags:    

Similar News