Team India: హార్దిక్ పాండ్యాతో టీమిండియాకు సమస్య తప్పదా?
Team India: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీం ఇండియా 2-1తో ముందంజలో ఉంది. అయినప్పటికీ మూడో మ్యాచ్‌లో కనబర్చిన ఆటతీరు జట్టుకు ఆందోళన కలిగించింది. రాజ్‌కోట్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 26 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంలో మిడిలార్డర్ బ్యాటింగ్‌లో వచ్చిన ఆటగాళ్లలో లోపాలు ప్రధాన కారణంగా మారాయి. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా స్లో ఇన్నింగ్స్ ఆడి కీలక దశలో అవుటవ్వడం, అతడు స్పిన్నర్లను ఎదుర్కొనే తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా 35 బంతుల్లో 40 పరుగులు చేశాడు. అయితే అతని స్ట్రైక్ రేట్ కేవలం 114.28 ఉండటం గమనార్హం. స్పిన్నర్ల బౌలింగ్ ఎదుర్కొనే సమయంలో అతను పూర్తిగా తడబడ్డాడు. అతని ఇన్నింగ్స్‌లో ఒక్క ఫోర్, రెండు సిక్సర్లే నమోదు కావడం, స్పిన్నర్లను ఎదుర్కొనే సమయంలో ఒక్క బౌండరీ కూడా లేకపోవడం టీం ఇండియాపై ఒత్తిడిని మరింత పెంచాయి. ఆఖరికి ఆ ఒత్తిడిలోనే అతను వికెట్ కోల్పోయాడు.
స్పిన్నర్లపై హార్దిక్ పాండ్యా ప్రదర్శన – గణాంకాలు ఏం చెబుతున్నాయంటే?
హార్దిక్ పాండ్యా స్పిన్నర్లకు ఎదురుగా తన కెరీర్ మొత్తంలోనే ఇబ్బంది పడుతున్నాడని గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి.
* టీ20 అంతర్జాతీయ మ్యాచుల్లో స్పిన్నర్లపై 377 బంతులు ఆడి, కేవలం 430 పరుగులు మాత్రమే చేశాడు.
* సగటు 43.00, కానీ స్ట్రైక్ రేట్ 114.05 మాత్రమే.
* 35.28 శాతం డాట్ బాల్స్ ఆడాడు. ఇది టీ20 ఫార్మాట్‌లో చాలా మందికి ఆందోళన కలిగించే విషయం.
* స్పిన్నర్ల బౌలింగ్‌లో 10 సార్లు ఔటయ్యాడు.
* ఇవీ చూస్తే, టీ20 ప్రపంచకప్ ముందు హార్దిక్ తన ఆటతీరు మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే వాదన వినిపిస్తోంది.
ఫాస్ట్ బౌలర్లపై హార్దిక్ ప్రదర్శన ఎలా ఉంది?
హార్దిక్ పాండ్యా స్పిన్నర్ల కంటే ఫాస్ట్ బౌలర్లను బాగా ఎదుర్కోగలగుతున్నాడు.
* తన కెరీర్‌లో ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్‌లో 866 బంతులు ఆడి, 152.42 స్ట్రైక్ రేట్తో 1320 పరుగులు చేశాడు.
* ఇందులో 104 ఫోర్లు, 70 సిక్సర్లు ఉన్నాయి.
* అయితే, 52 సార్లు ఫాస్ట్ బౌలింగ్‌కి ఔటయ్యాడు.
* ఇది చూస్తే, స్పిన్నర్లపై పాండ్య ఆటతీరు మెరుగుపడకపోతే భారత జట్టు ఆఖరి ఓవర్లలో అతనిపై ఆధారపడలేమనే అనిపిస్తోంది.
ఛాంపియన్స్ ట్రోపీ ముందు జట్టుకు హెచ్చరిక
ఛాంపియన్స్ ట్రోపీ సమీపిస్తుండగా టీం ఇండియాకు స్పిన్నర్లపై పాండ్యా ఆటతీరుపై సరైన వ్యూహం అవసరం. మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసేటప్పుడు అతను స్పిన్నర్లను ఎదుర్కొనే తీరు మెరుగుపర్చుకోకపోతే, మ్యాచ్‌ను ముగించాల్సిన కీలక దశలో జట్టుకు నష్టమే జరగొచ్చు.