IPL 2022: ఐపీఎల్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ గెలుపు.. కీలకపాత్ర పోషించిన షమీ...

IPL 2022 - LSG vs GT: యర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్న షమీ...

Update: 2022-03-29 01:00 GMT

IPL 2022: ఐపీఎల్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ గెలుపు.. కీలకపాత్ర పోషించిన షమీ...

IPL 2022 - LSG vs GT: ఐపీఎల్ టోర్నమెంటులో గుజరాత్ టైటాన్స్ జయకేతనం ఎగురవేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో ఆరు వికెట్లను కోల్పోయి 158 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో గుజరాత్ టీమ్ రెండు బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్ల తేడాతో విజయం సొంతం చేసుకుది. అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో తొలిబంతికే లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ లోకేశ్ రాహుల్ వికెట్ పడగొట్టిన మహ్మద్ షమీ, కాసేపటికే మరో ఓపెనర్ క్వింటన్ డీకాక్ ను పెవీలియన్ బాట పట్టించాడు.

ఆతర్వా మరో హార్డ్ హిట్టర్ మనీష్ పాండేను బోల్తాకొట్టించి మూడు కీలక వికెట్లను చేజిక్కించుకుని తక్కువ పరుగులకే లక్నోను నియంత్రించడంతో షమీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.ఐపీఎల్ 15 సీజన్లో కాలుమోపిన రెండు జట్లు ఇవాళ ఆసక్తికరపోరుకు తలపడ్డాయి. ముంబయి వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచులో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ పోటీ పడ్డాయి. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా... ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

లక్నో టీమ్ నుంచి దీపక్ హుడా 55 పరుగులు, ఆయుష్ బదోని 54 పరుగులతో జట్టకు గౌరవ ప్రదమైన స్కోరు సాధించి పెట్టారు. ఇక గుజరాత్ జట్టు తరఫున మ్యాథ్యూ వాడే, కెప్టెన్ హార్థిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా అద్భుతమైన ఆటతీరుతో జట్టు స్కోరును పరుగులు పెట్టించారు. ఇన్నింగ్స్ చివరి నాలుగు ఓవర్లలో బౌండరీలు, సిక్సర్లతో డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా ఆటను మలుపు తిప్పి విజయతీరం చేర్చారు.

Tags:    

Similar News