Mirabai Chanu: స్వరాష్ట్రంలో మీరాబాయికి ఘన స్వాగతం

* కోటిరూపాయల నజరానా ప్రకటించిన మణిపూర్ ప్రభుత్వం * పోలీస్ శాఖలో అడిషనల్ సూపరింటెండెంట్‌గా నియామకం

Update: 2021-07-28 01:29 GMT

కోటిరూపాయల నజరానా ప్రకటించిన మణిపూర్ ప్రభుత్వం (ట్విట్టర్ ఫోటో)

Mirabai Chanu: టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కి రజత పతాకాన్ని అందించిన వెయిట్ లిప్టర్ మీరాబాయి చానుకి సొంత రాష్ట్రంలో గ్రాండ్ వెల్ కమ్ దక్కింది. బిర్ టికేంద్రజిత్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మీరాబాయి చానుకి మణిపూర్ సీఎం బిరెన్ సింగ్ స్వయంగా వెళ్లి స్వాగతం పలికారు. విమానాశ్రయంలో తన తల్లిదండ్రుల్ని చూసిన మీరాబాయి చాను భావోద్వేగానికి గురైంది. మరోవైపు ఒలింపిక్స్ లో రజత పతకం గెలిచిన మీరాబాయి చానుకి మణిపూర్ ప్రభుత్వం కోటి రూపాయల నజరానా ప్రకటించింది. అలానే పోలీసు శాఖలో అడిషనల్ సూపరింటెండెంట్ గా ఆమెని నియమిస్తున్నట్లు మణిపూర్ ముఖ్యమంత్రి బిరెన్ సింగ్ వెల్లడించారు. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి హాజరైంది. ఈ సమయంలో ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిలిచి చప్పట్లతో స్వాగతం పలికారు. రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఘన సత్కర వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే మణిపూర్ సీఎం ఆమెకు కోటి రూపాయల చెక్‌ను, అడిషనల్ ఎస్పీ నియామక పత్రాన్ని అందించారు.

Tags:    

Similar News