Champions Trophy 2025: బంగ్లాదేశ్‌తో మ్యాచ్ కు రిషబ్ పంత్ దూరం ?

Rishabh Pant Injury Update: ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, కేఎల్ రాహుల్ ఫస్ట్ ఆప్షన్ వికెట్ కీపర్ అని స్పష్టం చేశారు.

Update: 2025-02-18 09:38 GMT

Rishabh Pant Injury Update: ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, కేఎల్ రాహుల్ ఫస్ట్ ఆప్షన్ వికెట్ కీపర్ అని స్పష్టం చేశారు. అదే సమయంలో ఆదివారం తీవ్రంగా రిషబ్ పంత్ గాయపడ్డాడు. రిషబ్ పంత్ గాయం భారత జట్టు యాజమాన్యం, అభిమానుల్లో ఉద్రిక్తతను పెంచింది. కానీ ఇప్పుడు రిషబ్ పంత్ గురించి క్రికెట్ అభిమానులకు శుభవార్త అందింది. సోమవారం రిషబ్ పంత్ ప్రాక్టీస్ కోసం నెట్స్ సెషన్‌లో కనిపించాడు. ఈ సమయంలో రిషబ్ పంత్ మోకాలికి ఎటువంటి పట్టీ కనిపించలేదు.. ఆదివారం నాడు రిషబ్ పంత్ నెట్స్ ప్రాక్టీస్ సమయంలో గాయపడ్డాడు.

టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం, నెట్స్‌లో హార్దిక్ పాండ్యా వేసిన బంతి రిషబ్ పంత్‌కు తగిలింది. ఆ తర్వాత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ నెట్స్‌ను వదిలి వెళ్ళాల్సి వచ్చింది. అయితే, ఇప్పుడు రిషబ్ పంత్ నెట్స్‌లో బ్యాటింగ్‌కు తిరిగి వచ్చాడు. అయితే, భారత జట్టు ప్లేయింగ్ XIలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ మధ్య ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో, భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఈ టోర్నమెంట్‌లో కెఎల్ రాహుల్ ఫస్ట్ ఆప్షన్ వికెట్ కీపర్‌గా ఉంటారని స్పష్టం చేశారు. అందువల్ల, రిషబ్ పంత్ బయట కూర్చోవాల్సి రావచ్చని చెబుతున్నారు. భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో కెఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా ఎంపికైతే, రిషబ్ పంత్‌కు ఇబ్బందులు పెరుగుతాయి.

ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా, భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, కెఎల్ రాహుల్ మా నంబర్-1 వికెట్ కీపర్ అని అన్నారు,. రిషబ్ పంత్ కు ఖచ్చితంగా అవకాశాలు లభిస్తుంది. కానీ ప్రస్తుతానికి కేఎల్ రాహుల్ మా ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్. కేఎల్ రాహుల్ నిలకడగా మంచి ప్రదర్శన ఇస్తున్నాడు. ప్లేయింగ్ ఎలెవన్‌లో ఇద్దరు వికెట్ కీపర్లను ఎంపిక చేయలేమని గౌతమ్ గంభీర్ అన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఫిబ్రవరి 20న భారత్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది.

Tags:    

Similar News