Former India player Sadashiv Rao Patil: భారత మాజీ క్రికెటర్ కన్నుమూత
Former India player Sadashiv Rao Patil: భారత మాజీ క్రికెటర్ సదాశివ్ రావూజీ పాటిల్ (86) సోమవారం రాత్రి కన్నుమూశారు. కొల్హాపూర్‌లోని రుయ్‌కార్ కాలనీలోగల తన నివాసంలో నిద్రలోనే పాటిల్ తుదిశ్వాస విడిచారు.
Former India player Sadashiv Rao Patil dies
Former India player Sadashiv Rao Patil: భారత మాజీ క్రికెటర్ సదాశివ్ రావూజీ పాటిల్ (86) సోమవారం రాత్రి కన్నుమూశారు. కొల్హాపూర్‌లోని రుయ్‌కార్ కాలనీలోగల తన నివాసంలో నిద్రలోనే పాటిల్ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని మంగళవారం ఉదయం ఆయన కుటుంబ సభ్యులు గుర్తించారు. పాటిల్ భారత్ తరపున ఒక్క టెస్ట్ మ్యాచ్ నే ఆడారు. ఫాస్ట్ బౌలింగ్ లో ఆల్ రౌండర్ గా పేరున్న పాటిల్ 1955లో న్యూజీలాండ్ తో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడారు.
మహారాష్ట్ర తరపున 1952-64 మధ్య 36 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడారు. 866 పరుగులు, 83 వికెట్లు తీశారు. అంతేకాదు ఒక రంజీ ట్రీఫీలో భాగంగా పాటిల్ మహారాష్ట్ర రంజీ జట్టుకు సారధిగా పని చేశారు. పాటిల్ మృతిపై పలువురు క్రీడాప్రముఖులు, రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.