MS Dhoni Special Story: హ్యాపీ బర్త్ డే "మిస్టర్ కూల్"

Update: 2021-07-07 10:32 GMT

ధోని (ఫైల్ ఫోటో)

MS Dhoni: సరైన వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మెన్ దొరక్క టీమిండియా అవస్థలు పడుతున్న సమయమదిమిడిల్ ఆర్డర్ లో వెన్నెముకల నిలిచే బ్యాట్స్ మెన్ లేక భారత జట్టు సతమతమవుతున్న కాలమది. సరిగ్గా ఆ టైమ్ లో టీమ్ లోకి వచ్చాడు ధోనీ.వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మెన్ పేరుతో భారత జట్టులోకి వచ్చిన ధోనీ అప్పటికి అదే స్థానం కోసం పోటీ పడుతున్న దినేశ్ కార్తిక్, పార్ధివ్ పటేల్ లాంటి ఆటగాళ్ళతో తన స్థానం కోసం పోటీ పడాల్సి వచ్చింది. 2004 డిసెంబర్ 13 న బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో అంతర్జాతీయ మ్యాచ్ లో అరంగేట్రం చేసిన ధోని మొదటి మ్యాచ్ లో సున్నా పరుగులకే వెనుతిరిగిన తర్వాత 2005 లో భారత చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ పై 148 పరుగులు సాధించడంతో పాటు శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 183 పరుగులతో సత్తా చాటి తన స్థానం కోసం పోటీ పడుతున్న ఆటగాళ్ళకు ధోనీ చెక్ పెట్టేశాడు. టీమిండియాలో డిపెండబుల్ బ్యాట్స్ మెన్ గా వికెట్ కీపర్ గా మంచి ప్రదర్శన కనబరిచిన ధోని అతి తక్కువ కాలంలోనే భారత జట్టు కెప్టెన్ గా బాధ్యతలను స్వీకరించాడు.

టీమిండియాను భారీ విజయాలతో తిరుగులేని జట్టుగా నడిపించిన ధోని 1981 జూలై 7న జార్ఖండ్‌లోని రాంచీలో జన్మించి నేటితో 40వ వసంతంలోకి అడుగుపెట్టాడు. సౌరవ్ గంగూలీ తర్వాత మళ్ళీ భారత జట్టుకు అసలైన నాయకుడు అంటే ధోనీయే అనిపించుకున్నాడు. తన సారధ్యంలో 2011 దక్షిణాఫ్రికాలో జరిగిన వన్డే ప్రపంచ కప్ ను సాధించి భారత క్రీడాభిమానులకు కానుక ఇవ్వడంతో పాటు 2013లో జరిగిన ఐసిసి క్రికెట్ ట్రోఫీ టీ20 వరల్డ్ కప్ నూ సాధించి వంద కోట్ల భారతీయుల మనసులను గెలిచాడు ధోనీ. చివరి బంతికి సిక్సర్ కొట్టి విజయాన్ని అందించిన రోజున ఎలా ఉన్నాడో.. ఇంటిపై క్రికెట్ అభిమానులు రాళ్ళేసిన రోజున కూడా అలాగే ఉన్న ధోని తన స్థిరమైన ప్రదర్శనతో క్లిష్ట పరిస్థితుల్లో కూడా తన సహనాన్ని కోల్పోకుండా "మిస్టర్ కూల్ కెప్టెన్" గా ఖ్యాతి గడించాడు.

భారత క్రికెట్ చరిత్రలో ధోనీ అనేది ఓ అద్భుతమైన, సుదీర్ఘమైన, మరిచిపోలేని అధ్యాయం. అంతే కాకుండా తను క్రీడారంగంలో ధోని చేసిన సేవలకి పద్మ భూషణ్, పద్మ శ్రీ, రాజీవ్ ఖేల్ రత్న వంటి అవార్డులతో భారత ప్రభుత్వం ధోనిని సత్కరించింది. 2020 ఆగష్టు15 రాత్రి 7:29 నిమిషాలకు సోషల్ మీడియాలో తన రిటైర్మెంట్ ప్రకటించిన ధోని ఆట నుండి దూరం అయిన క్రికెట్ ఉన్నంత వరకు ధోనీయే తమ అభిమాన ఆటగాడు అని కోట్లాది ప్రజలు సోషల్ మీడియా వేదికగా తమ అభిమానాన్ని పంచుకుంటున్నారు. హ్యాపీ బర్త్ డే ధోనీ.

Tags:    

Similar News