గుండెపోటుతో మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ కన్నుమూత

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ గుండెపోటుతో గురువారం ముంబైలో మరణించారు.. ఆయన వయసు 59 సంవత్సరాలు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్..

Update: 2020-09-24 11:27 GMT

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ గుండెపోటుతో గురువారం ముంబైలో మరణించారు.. ఆయన వయసు 59 సంవత్సరాలు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2020 కి వ్యాఖ్యాతగా ఉంటూ ముంబైలో ఉన్నారు. గురువారం ఉదయం జోన్స్, బ్రెట్ లీ అలాగే మరొక వ్యాఖ్యాత నిఖిల్ చోప్రాతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. అయితే ఆయన బస చేసిన హోటల్ లాబీలో గుండెపోటుతో కుప్పకూలాడు. ఈ విషయాన్నీ స్టార్ ఇండియా ప్రకటించింది. ఈ మేరకు ఇలా పేర్కొంది.. 'మిస్టర్ డీన్ మెర్విన్ జోన్స్ మరణించిన వార్తలను మేము పంచుకోవడం చాలా బాధగా ఉంది.

ఆయన అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు' అని స్టార్ స్పోర్ట్స్ ద్వారా ఐపిఎల్ ప్రసారానికి ఆతిథ్యమిస్తున్న స్టార్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. కాగా డీన్ జోన్స్ మృతదేహాన్ని ఆస్ట్రేలియాకు తరలించడానికి ఆస్ట్రేలియా హైకమిషన్తో సంప్రదిస్తుంది ఐపీఎల్. కాగా జోన్స్ ఆస్ట్రేలియా తరఫున 52 టెస్టులు ఆడారు.. 11 సెంచరీలతో 46.55 సగటుతో 3631 పరుగులు చేశారు. 1986 టై టై టెస్టులో భారత్‌పై డబుల్ సెంచరీ సాధించారు. ఇక 164 వన్డేలు ఆడిన డీన్ జోన్స్ ఏడు సెంచరీలతో 44.61 వద్ద 6068 పరుగులు చేశారు. 1984లో టెస్ట్ మ్యాచ్ తో ఆరంగ్రేటం చేసిన జోన్స్.. 1994 లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. 

Tags:    

Similar News