Team India: ఆ పాస్ట్‌ బౌలర్ ఇక 'టీంఇండియా'కు ఆడనట్లేనా..!

Team India: దేశవాళీ క్రికెట్‌లో రికార్డు ప్రదర్శనతో ఆకట్టుకున్న ఓ పాస్ట్‌ బౌలర్... ఇక టీం ఇండియాకు ఆడడం కష్టమట.

Update: 2021-05-26 15:30 GMT

జయదేవ్ ఉనద్కత్ (ఫొటో ట్విట్టర్)

Team India: దేశవాళీ క్రికెట్‌లో రికార్డు ప్రదర్శనతో ఆకట్టుకున్న ఓ పాస్ట్‌ బౌలర్... ఇక టీం ఇండియాకు ఆడడం కష్టమట. ఆ బౌలర్ ఎవరో కాదు.. జయదేవ్ ఉనద్కత్ (29). రంజీ ట్రోఫీ 2019-20 సీజన్‌లో ఏకంగా 67 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు ఈ ఎడమచేతి వాటం బౌలర్. సౌరాష్ట్ర టీంని ఫైనల్‌ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. 2018లో చివరిగా టీమిండియా తరఫున జయదేవ్ మ్యాచ్‌లు ఆడాడు. అనంతరం ఐపీఎల్ 2021 లోనూ రాజస్థాన్ రాయల్స్‌ తరపున బరిలోకి దిగాడు. ఈ సీజన్‌లో 4 మ్యాచ్‌లాడిన ఉదన్కత్ 7.06 ఎకానమీతో 4 వికెట్లు పడగొట్టాడు.

కానీ, ఇంగ్లాండ్‌ టూర్‌కి ఇటీవల ఎంపిక చేసిన భారత్ జట్టులో చోటు దక్కలేదు. స్టాండ్ బై ప్లేయర్‌గా కూడా అవకాశం లభించలేదు. జయదేవ్ ఉనద్కత్‌ని ఎంపిక చేయకపోవడంపై అతని కోచ్, మాజీ ఫాస్ట్ బౌలర్ కర్సన్ గావ్రి స్పందించాడు. ఈమేరకు టీం ఇండియా సెలక్టర్లను అడగగా.. జయదేవ్ ఉనద్కత్‌ని ఎప్పటికీ జట్టులోకి ఎంపిక చేయబోం అన్నారని, ప్రాబబుల్స్‌లోనూ జయదేవ్‌ పేరు చర్చకి కూడా రాలేదని చెప్పారని తెలిపాడు. కారణం అడగగా... జయదేవ్‌ ఇప్పటికే 30 ఏళ్లకు చేరుకున్నాడని, ఇప్పుడు అవకాశం ఇచ్చినా ఎన్నేళ్లు భారత్‌ తరపున ఆడగలడని చెప్పారని అన్నాడు. దీంతో జయదేవ్ ఇక ఎప్పటికీ టీం ఇండియా తరపున ఆడలేడేమో.

Tags:    

Similar News