India vs England: ఇంగ్లాండ్ లక్ష్యం 186 : ఆకట్టుకున్న యాదవ్ (57)

India vs England 4th T20: ఇంగ్లాండ్ తో జరుగుతున్న 4 వ టీ20లో టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 185 పరుగులు చేసింది.

Update: 2021-03-18 15:35 GMT

సూర్య కుమార్ (ఫొటో ట్విట్టర్)

India vs England 4th T20: ఇంగ్లాండ్ తో జరుగుతున్న 4 వ టీ20లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లోనూ టాస్ టీమిండియాను వరించలేదు. రోహిత్ శర్మ, రాహుల్ ఓపెనింగ్ జోడి గా వచ్చింది. ధాటిగానే ఆడిన రోహిత్ (12 పరుగులు, 12 బంతులు, 1ఫోర్, 1సిక్స్) 4 ఓవర్లో ఆర్చర్ బౌలింగ్ అతనికే క్యాచ్ ఇచ్చి మొదటి వికెట్ గా వెనుదిరిగాడు.

అనంతరం సూర్యకుమార్ బ్యాటింగ్ వచ్చాడు. రాహుల్ (14పరుగులు, 17 బంతులు, 2 ఫోర్లు) ఈ మ్యాచ్ లోనైనా పరుగుల దాహాన్ని తీర్చుకోలేక పోయాడు. కొద్దిసేపు క్రీజులో కుదుకోవడానికే చాలా కష్టపడ్డాడు. చివరికి 8 ఓవర్లో స్టోక్స్ బౌలింగ్ లో ఆర్చర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా...సూర్యకుమార్ ధాటిగానే ఆడి స్కోర్ బోర్డును పరుగెలెత్తించాడు.

అనంతరం కోహ్లీని (1పరుగు) రషీద్ గుగ్లీ తో బోల్తా కొట్టించాడు. అప్పటికి టీమిండియా 8.4 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ వచ్చిన పంత్ తో కలిసి సూర్యకుమార్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ధాటిగా ఆడిన సూర్యకుమార్ (57 పరుగులు, 31 బంతులు, 4ఫోర్లు, 3 సిక్సులు) టీ20ల్లో ఫస్ట్ హాస్ సెంచరీని పూర్తిచేసుకున్నాడు. అనంతరం 13.2వ ఓవర్లో కుర్రాన్ బౌలింగ్ పెవిలియన్ చేరాడు.

శ్రేయాస్ అయ్యర్, పంత్ జోడీ సింగిల్స్ తీస్తూ..వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ వేగాన్ని పెంచారు. 16.2 ఓవర్లో పంత్ (30పరుగులు, 23 బంతులు, 4 ఫోర్లు) ను ఆర్చర్ బోల్తాకొట్టించాడు. అలాగే హార్దిక్ పాండ్యా(11పరుగులు, 8బంతులు, 1సిక్స్) ను వుడ్ పెవిలియన్ కు చేర్చాడు. హాప్ సెంచరీ దిశగా సాగుతున్న శ్రేయాస్ అయ్యర్ (37పరుగులు, 18 బంతులు, 5ఫోర్లు, 1 సిక్స్) ను 19.1 ఓవర్లో ఆర్చర్ అడ్డుకున్నాడు. బౌలర్లలో ఆర్చర్ 4 వికెట్లతో రాణించాడు.

Tags:    

Similar News